Google to establish its Safety Engineering Centre (GSEC) at Hyderabad(X)

తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది గూగుల్‌ కంపెనీ. హైదరాబాద్‌లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చర్చలు జరిపారు గూగుల్ ప్రతినిధులు.

ఆగస్టు 2024లో గూగుల్‌ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లిన సమయంలో చర్చలు జరిపారు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు. గూగుల్‌ మేనేజ్‌మెంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా ఒప్పించారు రేవంత్ రెడ్డి.

 ఆర్య వైశ్యులు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు, హైదరాబాద్‌లో మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి

Here's Tweet:

ఆసియా పసిఫిక్ రీజియన్‌లో టోక్యో తర్వాత హైదరాబాద్‌లోనే గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుకానుంది. ఈ సెంటర్ ఏర్పాటుతో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.