CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం

శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్తీక పూర్ణిమ శుభవేళ సతీసమేతంగా ఎన్ టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు రేవంత్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...ఒక్క దీపాన్ని వెలిగించినా, ఒక్క దీపాన్ని సంరక్షించినా అది మనకు ముక్తిని కలిగిస్తుంది అన్నారు. సమాజానికి మేలు జరుగుతుందని వేదపండితులు బోధిస్తున్నారు... అలాంటిది కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు.

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం
Telangana CM Revanth Reddy Speech in Koti Deepotsavam(X)

Hyd, Nov 16:  శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్తీక పూర్ణిమ శుభవేళ సతీసమేతంగా ఎన్ టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు రేవంత్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...ఒక్క దీపాన్ని వెలిగించినా, ఒక్క దీపాన్ని సంరక్షించినా అది మనకు ముక్తిని కలిగిస్తుంది అన్నారు. సమాజానికి మేలు జరుగుతుందని వేదపండితులు బోధిస్తున్నారు... అలాంటిది కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు.

ఈ కార్యక్రమ స్పూర్తిగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో దీపోత్సవం జరుగుతుందని సీఎం చెప్పారు. కోటి దీపోత్సవం నిర్వహించి దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన యాజమాన్యాన్ని అభినందించారు. ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ రాష్ట్రం. ఇది శైవ క్షేత్రం. వేయి స్తంభాల గుడి, రాజన్న దేవాలయం, అలంపూర్ క్షేత్రం, మల్లికార్జున దేవాలయంతో ఈ త్రిలింగ దేశంలో నలువైపులా శివ భక్తులు ఉన్నారని, వారితో ప్రపంచమంతా వీక్షించేలా దీపోత్సవం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి గణపతి సచ్చిదానంద స్వామిని ఆహ్వానించి భక్తకోటిని అందర్నీ వారిచేత ఆశీర్వదింపజేసినందుకు తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొని అగ్నిలింగ క్షేత్రం తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి కళ్యాణమహోత్సవాన్ని వీక్షించారు రేవంత్ రెడ్డి.  35 శాతం కుటుంబ సర్వే పూర్తి..ఎలాంటి అపోహలు వద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజలంతా స్వచ్ఛందంగా సర్వేకు సహకరిస్తున్నారన్న పొన్నం 

వేదికపై స్వర్ణలింగానికి రజిత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన నిర్వహణ అనంతరం అవధూత దత్తపీఠం (మైసూరు) పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీర్వచనాలను తీసుకున్నారు. తర్వాత జ్వాలతోరణ మహోత్సవంలో పాల్గొనడంతో పాటు గణపతి సచ్చిదానంద స్వామి వారితో కలిసి వేదికపై కార్తీక దీపారాధన చేశారు.

(The above story first appeared on LatestLY on Nov 16, 2024 10:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).