Rythu Nestham in Telangana: డిజిటల్ ఫ్లాట్ ఫా ద్వారా అన్నదాతల సమస్యలు పరిష్కారం, రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో సీఎం రేవంత్ మాట్లాడారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా రియల్ టైంలో రైతు సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ‘రైతునేస్తం’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో సీఎం రేవంత్ మాట్లాడారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా రియల్ టైంలో రైతు సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ‘రైతునేస్తం’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక క్లస్టర్ చొప్పున ఎంపిక చేసిన ప్రభుత్వం.. త్వరలో దశల వారీగా మొత్తం 2,601 క్లస్టర్ల పరిధిలో ఉన్న రైతువేదికలకు వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం కల్పించనుంది. రూ.97 కోట్లతో ప్రాజెక్టు అమలే లక్ష్యంగా, మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటుకు రూ. 4.07 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు వ్యవసాయ విస్తరణ సేవలతోపాటు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందించనున్నారు. గుంటూరు, గుడివాడ వెళ్లి కార్పోరేట్ స్కూళ్లలో చదవలేదు, తనకు ఇంగ్లీష్ రాదనే వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ఫ్లాట్ ఫారం ఉండనుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చించనున్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్‌లైన్‌లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవటం. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవటం. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంది. తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహాయంతో రైతులకు పలు సూచనలు చేయనున్నారు.
Here's TS CMO Tweet
రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి వీలుగా 'రైతు నేస్తం' కార్యక్రమం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula చెప్పారు. కరువొచ్చినా, కష్టమొచ్చినా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం… pic.twitter.com/OUNwKx6ms1
— Telangana CMO (@TelanganaCMO) March 6, 2024
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు.
(The above story first appeared on LatestLY on Mar 06, 2024 08:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

