CM Revanth Reddy Davos Tour: దావోస్ పర్యటనకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి, భారీ పెట్టుబడులే లక్ష్యంగా 5 రోజుల పర్యటన, 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం

తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌(స్విట్జర్లాండ్‌) పర్యటనకు నేడు బయల్దేరారు. ఈ రోజు ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్తున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) 54వ సమావేశంలో సీఎం రేవంత్‌ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది.

CM Revanth Reddy Davos Tour: దావోస్ పర్యటనకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి, భారీ పెట్టుబడులే లక్ష్యంగా 5 రోజుల పర్యటన, 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం
cm revanth reddy

Hyd, Jan 15: తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌(స్విట్జర్లాండ్‌) పర్యటనకు నేడు బయల్దేరారు. ఈ రోజు ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్తున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) 54వ సమావేశంలో సీఎం రేవంత్‌ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది.ఈ నెల 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ‘ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం) 54వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం నేతృత్వంలో తెలంగాణ అధికారిక బృందం తరలివెళ్లింది.

విదేశీ, భారతీయ పారిశ్రామికవేత్తలను కలుసుకొని కొత్త ప్రభుత్వ దార్శనికతను, ప్రాథమ్యాలను వివరించడానికి ప్రపంచ ఆర్థిక వేదిక ఒక అద్భుత అవకాశంగా సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కూడా ఉన్నారు.

రైతుల రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్, 30 లక్షల మంది రైతుల రూ.32 వేల కోట్ల పంట రుణాల మాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటన

రాష్ట్ర బృందం ఎకనామిక్‌ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్‌ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది.

ఐటీ రంగంలో అగ్రగామిగా, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటిచెప్పి, భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి దీన్ని చక్కటి వేదికగా వినియోగించుకోవాలని నిర్ణయించింది.ఈ వేదికలో నోవార్టిస్‌, మెడ్‌ట్రానిక్‌, ఆస్ట్రాజెనికా, గూగుల్‌, ఊబర్‌, మాస్టర్‌ కార్డ్‌, బేయర్‌, ఎల్డీసీ, యూపీఎల్‌ తదితర అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో భేటీ కానున్నారు. భారత్‌కు చెందిన టాటా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, జేఎస్‌డబ్ల్యూ, గోద్రెజ్‌, ఎయిర్‌టెల్‌, బజాజ్‌ వంటి సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. సీఐఐ, నాస్కామ్‌ వంటి వ్యాపార ఛాంబర్స్‌ ప్రతినిధులతోనూ భేటీ అవుతారు.

మేడారంలో తాత్కాలికంగా 50 పడకల ఆసుపత్రి.. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం

తొలి దావోస్‌ పర్యటనలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం కాంగ్రెస్‌ సెంటర్‌లో ప్రసంగించాల్సిందిగా ఆయనను నిర్వాహకులు ఆహ్వానించారు. అక్కడ జరగబోయే చర్చాగోష్ఠిలో ‘పురోగమిస్తున్న వైద్యరంగం’పై సీఎం మాట్లాడనున్నారు. ‘ఫుడ్‌ సిస్టమ్స్‌ అండ్‌ లోకల్‌ యాక్షన్‌’ అనే అంశంపై జరగనున్న అత్యున్నత స్థాయి సదస్సులోనూ రేవంత్‌ పాల్గొంటారు. ఈ సదస్సులో ‘వాతావరణ మార్పుల ప్రభావం.. రైతుల జీవనోపాధి పరిరక్షణ.. వాతావరణం ప్రకారం సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యలు’ తదితర అంశాలపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఏఐ పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేస్తున్న చర్చా వేదికలో ‘డెవలపింగ్‌ స్కిల్స్‌ ఫర్‌ ఏఐ’ అనే అంశంపై మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగించనున్నారు.

ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) 54వ వార్షిక సమావేశం సోమవారం దావోస్‌లో ప్రారంభం కానుంది. ఇందులో భారత్‌ సహా వివిధ దేశాలకు చెందిన 2,800 మంది నేతలు పాల్గొంటున్నారు. వీరిలో 60 మందికిపైగా ప్రభుత్వాధినేతలూ ఉంటారు. భారత్‌ నుంచి కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, అశ్వినీ వైష్ణవ్‌, హర్‌దీప్‌ సింగ్‌ పురీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు రేవంత్‌రెడ్డి, సిద్ధరామయ్య, ఏక్‌నాథ్‌ శిందేలు, రాష్ట్రాల మంత్రులు పలువురు, వంద మందికిపైగా సీఈవోలు పాలుపంచుకుంటున్నారు.

ఈ దఫా డబ్ల్యూఈఎఫ్‌లో భారత్‌కు చెందిన దాదాపు డజను లాంజ్‌లు, పెవిలియన్లు ఏర్పాటయ్యాయి. ఇందులో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు సంబంధించినవి ఉన్నాయి.

(The above story first appeared on LatestLY on Jan 15, 2024 11:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).