COVID in TS: తెలంగాణలో కొత్తగా 366 కోవిడ్ కేసులు నమోదు, ఒక్క జీహెచ్ఎంసీ నుంచే వందకు పైగా కేసులు, గడిచిన ఒక్కరోజులో 345 మంది రికవరీ, రాష్ట్రంలో 6,295కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

COVID in TS: తెలంగాణలో కొత్తగా 366 కోవిడ్ కేసులు నమోదు, ఒక్క జీహెచ్ఎంసీ నుంచే వందకు పైగా కేసులు, గడిచిన ఒక్కరోజులో 345 మంది రికవరీ, రాష్ట్రంలో 6,295కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Hyderabad, August 25: తెలంగాణలో రోజూవారీ కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రతిరోజు 3 నుంచి 4 వందల మధ్య కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కొత్తగా నమోదయ్యే కేసులతో పాటు, కోలుకునే వారి సంఖ్య కూడా ఇంచుమించుగా అదే స్థాయిలో ఉంటుంది. దీంతో రాష్ట్రంలోని ఆక్టివ్ కోవిడ్ కేసుల్లో గణనీయమైన మార్పులేమి కనిపించడం లేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 80,470 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 366 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1,387 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,56,098కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 102 కేసులు నిర్ధారణ కాగా, కరీంనగర్ నుంచి 34 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,864కు పెరిగింది.

అలాగే సాయంత్రం వరకు మరో 345 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,45,939 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,295 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది

(The above story first appeared on LatestLY on Aug 25, 2021 09:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).