Telangana MBBS Admissions: నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికత.. ఏపీలో రెండేళ్లు చదివిన తెలంగాణ విద్యార్థినికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

ఉన్నత విద్యాభ్యాసం కోసం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన తెలంగాణకు చెందిన విద్యార్థిని జెల్లా అంకితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వైద్య విద్య సహా ఇతర కోర్సుల ప్రవేశాల్లో స్థానికత నిర్ధారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, రాష్ట్రపతి ఉత్తర్వులే తుది నిర్ణయమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Telangana MBBS Admissions: నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికత.. ఏపీలో రెండేళ్లు చదివిన తెలంగాణ విద్యార్థినికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
Supreme Court (X)

Telangana MBBS Admissions: ఉన్నత విద్యాభ్యాసం కోసం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన తెలంగాణకు చెందిన విద్యార్థిని జెల్లా అంకితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వైద్య విద్య సహా ఇతర కోర్సుల ప్రవేశాల్లో స్థానికత నిర్ధారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, రాష్ట్రపతి ఉత్తర్వులే తుది నిర్ణయమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణించే నిబంధన అమల్లో ఉన్నప్పుడు.. దానికి విరుద్ధంగా ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. న్యాయమూర్తులు జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సదరు విద్యార్థిని దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.  మందుబాబులుకు పండగే పండగ.. తెలంగాణలో కొత్తగా 41 బార్లు వచ్చేస్తున్నాయి..ఎక్కడెక్కడ అంటే..

పిటిషనర్ అంకిత ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు వరుసగా 12 ఏళ్ల పాటు తెలంగాణలోనే చదువుకుంది. అయితే ఇంటర్మీడియెట్‌ రెండేళ్లు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి చేసింది. వైద్య విద్య ప్రవేశాల సమయంలో స్థానికత నిర్ధారణకు ఇంటర్మీడియట్, అంతకుముందు రెండేళ్లు (వరుసగా నాలుగేళ్లు) ఎక్కడ చదివితే వారినే స్థానికులుగా పరిగణిస్తారనే నిబంధన అవరోధంగా మారింది. దీనితో ఆమె తెలంగాణలో స్థానిక కోటాకు అర్హత కోల్పోయింది.

గతంలో తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వ స్థానికత నిబంధనలను సమర్థించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కేవలం మెరుగైన చదువు కోసమే అంకిత ఏపీకి వెళ్లారని, ఆమె కుటుంబం తరతరాలుగా తెలంగాణలోనే నివసిస్తోందని తెలిపారు. ఈ నిబంధన వల్ల ఆమె అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ స్థానికత కోల్పోయి తీవ్రంగా నష్టపోతోందని వాదించారు.

వాదనలు పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. "తండ్రి నివాసంతో సంబంధం లేకుండా, చదువు కోసం మీరు రాష్ట్ర సరిహద్దులు దాటారు. ఇక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. వాటికి విరుద్ధంగా ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు లేదా ప్రయోజనాలు కల్పించలేము. అలా చేస్తే అది రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందని జస్టిస్ పీఎస్ నరసింహ స్పష్టం చేశారు. విద్యార్థినికి నిబంధనల ప్రకారం వేరే ప్రత్యామ్నాయం లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

 

(The above story first appeared on LatestLY on Sep 29, 2026 04:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).