Hyd, Nov 8: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి ,వర్ధన్నపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పొంగులేటి. అనంతరం మాట్లాడిన ఆయన నాటు బాంబు కాదు లక్ష్మి బాబు కాదు తప్పు చేసిన వారికి అటుంబంలాగా పనిచేస్తుందని తెలిపారు. చట్టం తన పనిని తాను చేసుకుంటూ పోతుందని తప్పు చేసిన వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష పడుతుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ తూచా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతుందన్నారు.
గత పాలకులు 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 13వేల కోట్ల రుణమాఫీ చేశామని ఇంకా మిగిలిన 18 వేల కోట్ల రుణమాఫీని డిసెంబర్ నెలలోగా పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు.. ఈ సందర్భంగా ఆవగింజలతో రేవంత్ చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారుడు రాము (వీడియో)
Here's Video:
వరంగల్ జిల్లా
తప్పు చేసిన వారికి ఆటం బాంబు పేలబోతుంది*మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
గత పాలకులు 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
వరంగల్ జిల్లా రాయపర్తి ,వర్ధన్నపేట మండలంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన పనులను… pic.twitter.com/UFEVPvlLRZ
— Aadhan Telugu (@AadhanTelugu) November 8, 2024
రుణమాఫీ చేసి చూపిస్తే ఏ టైర్ కింద తలపెడతారో చెప్పాలని ప్రతిపక్షాలకు సవాలను విసిరారు. గత ప్రభుత్వం పింక్ షర్ట్ నాయకులకు ఇండ్లను పథకాలను కట్టబెట్టిందని ఆరోపించారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ వెన్నంటు ఉంటుందని , ఏ పార్టీ అనేది కాకుండా పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు.