COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 1682 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 93 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 711కు పెరిగిన కరోనా మరణాలు

నిన్న, మొన్నటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భయపెట్టిన కరోనా ఇప్పుడు చాలా వరకు ఉధృతి తగ్గింది. జీహెచ్ఎంసీలో క్రమంగా కేసులు తగ్గుతుండటం విశేషం. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 235 మందికి కోవిడ్ సోకినట్లు ....

COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 1682 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 93 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 711కు పెరిగిన కరోనా మరణాలు
Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Hyderabad, August 18:  తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 19,579 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో  1,682 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 560 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,72,928 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 93,937కి చేరుకుంది.

నిన్న, మొన్నటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భయపెట్టిన కరోనా ఇప్పుడు చాలా వరకు ఉధృతి తగ్గింది. జీహెచ్ఎంసీలో క్రమంగా కేసులు తగ్గుతుండటం విశేషం.  నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 235 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  మేడ్చల్ నుంచి 106 ,  రంగారెడ్డి జిల్లా నుంచి 166 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.

అయితే కరీంనగర్, వరంగల్, మరియు నిజామాబాద్ జిల్లాల్లో మాత్రం కేసులు పెరుగుతూపోతున్నాయి.

వరంగల్ అర్బన్ నుంచి నిన్న 107 పాజిటివ్ కేసులు నివేదించబడగా, కరీంనగర్ నుంచి 88 మరియు అలాగే  జామాబాద్ జిల్లా నుంచి 94 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

ఆగష్టు 17న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 8 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 711 కు పెరిగింది.

అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 2070 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 72,202 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,024 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

 

(The above story first appeared on LatestLY on Aug 18, 2020 10:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).