Corona in Telangana: తెలంగాణలో 97 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1724 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో, 729కు పెరిగిన కరోనా మరణాలు

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 97,424కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 395 మందికి COVID సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 105 , రంగారెడ్డి జిల్లా నుంచి 169

Corona in Telangana: తెలంగాణలో 97 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1724 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో, 729కు పెరిగిన కరోనా మరణాలు
COVID19 Outbreak in Telangana. | Photo: Twitter

Hyderabad, August 20:  తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 23,841 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,724 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 968 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,21,311 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 97,424కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 395 మందికి COVID సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 105 , రంగారెడ్డి జిల్లా నుంచి 169, మరియు సంగారెడ్డి జిల్లాల నుంచి 45 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.

అలాగే కరోనా తీవ్రత అధికంగా ఉన్న కరీంనగర్ నుంచి 101, వరంగల్ అర్బన్ నుంచి 91 కేసుల చొప్పున పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

ఆగష్టు 19న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 10 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 729 కు పెరిగింది.

అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 1,195మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 75,186 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,509 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Aug 20, 2020 09:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).