Telangana's Health Bulletin: తెలంగాణలో 95 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1763 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 719కు పెరిగిన కరోనా మరణాలు
కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 24,542 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,763 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1042 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు....
Hyderabad, August 19: తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 24,542 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,763 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1042 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,97,470 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 95,700కి చేరుకుంది.
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 484 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 169, రంగారెడ్డి జిల్లా నుంచి 166, మరియు సంగారెడ్డి జిల్లాల నుంచి 31 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కరోనా ఉధృతి తగ్గడం లేదు. వరంగల్ అర్బన్ నుంచి నిన్న 88 పాజిటివ్ కేసులు నివేదించబడగా, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల మరియు సిరిసిల్ల జిల్లాలను కలిపి మొత్తంగా 191 కేసులు నిర్ధారించబడ్డాయి.
Telangana's COVID19 Bulletin:

ఆగష్టు 18న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

మరోవైపు గత 24 గంటల్లో మరో 8 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 719 కు పెరిగింది.
అలాగే, మంగళవారం సాయంత్రం వరకు మరో 1789 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 73,991 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,990 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Aug 19, 2020 09:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

