COVID19 in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 2,072 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1 లక్షా 89 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 1116కు పెరిగిన కరోనా మరణాలు
నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా 139 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరీంనగర్ నుంచి 109, మరియు ఖమ్మం నుంచి 92 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి....
Hyderabad, September 29: తెలంగాణలో కరోనా ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 54,308 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,072 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 790 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 29,40,642 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,89,283కి చేరుకుంది.
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 283 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 161, మేడ్చల్ నుంచి 160 కేసులు నిర్ధారణయ్యాయి.


మరోవైపు గత 24 గంటల్లో మరో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1116కు పెరిగింది.
అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 2259 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,58,690 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,477 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Sep 29, 2020 09:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

