COVID19 in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 2,166 పాజిటివ్ కేసుల నమోదు, రాష్ట్రంలో 1 లక్షా 74 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 1052కు పెరిగిన కరోనా మరణాలు

సోమవారం సాయంత్రం వరకు మరో 2143 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,44,073 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు....

COVID19 in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 2,166 పాజిటివ్ కేసుల నమోదు, రాష్ట్రంలో 1 లక్షా 74 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 1052కు పెరిగిన కరోనా మరణాలు
Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Hyderabad, September 22:  తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 53,690 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,166  మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1,528 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 25,73,005 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,74,774కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 309 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  రంగారెడ్డి నుంచి 166,  మేడ్చల్ నుంచి 147 కేసులు నిర్ధారణయ్యాయి.

ఇటు  జిల్లాల్లో కూడా కొవిడ్ విజృంభన కొనసాగుతోంది, నిన్న కరీంనగర్  జిల్లా నుంచి అత్యధికంగా 127 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే  వరంగల్ అర్బన్ నుంచి 95,  మహబూబాబాద్ నుంచి 90, నిజామాబాద్ నుంచి 90 మరియు సిద్ధిపేట నుంచి 88  కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 10 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1052 కు పెరిగింది.

అలాగే,  సోమవారం సాయంత్రం వరకు మరో 2143 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,44,073 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,649 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Sep 22, 2020 08:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).