COVID19 in Telangana: తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడగింపు; రాష్ట్రంలో కొత్తగా 2,524 పాజిటివ్ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 3,464 బాధితులు రికవరీ
సాయంత్రం వరకు మరో 3,464 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,40,986 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 34,084 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ
Hyderabad, May 31: తెలంగాణలోని పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులను పొడగించింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో సెలవులను జూన్ 15 వరకు పొడగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డైట్ కళాశాలలకు కూడా సెలవులను జూన్ 15 వరకు పొడగించారు.
ఇక తెలంగాణలో కోవిడ్ కేసులు చాలా వరకు తగ్గుతున్నాయి, రాష్ట్రంలో లాక్డౌన్ విధించక మునుపు రోజూవారీ కేసులు సుమారుగా 5 వేలకు అటు ఇటుగా కేసులు వచ్చేవి, ఇరవై రోజుల లాక్డౌన్ అనంతరం ఇప్పుడు కేసులు దాదాపు సగానికి తగ్గాయి. మరోవైపు కేసుల కంటే ఎక్కువగా రికవరీల సంఖ్య ఉంటుండంతో రాష్ట్రంలో ఆక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో లాక్డౌన్ ఇప్పుడు మరో పది రోజులు పొడగించారు, అలాగే మరికొన్ని సడలింపులు ఇచ్చారు. దీంతో రాబోయే ఈ పదిరోజుల్లో కేసుల సంఖ్య ఎలా ఉండనుందో చూడాలి.
ప్రస్తుతం రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 87,110 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,524 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1948మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,78,351కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 307 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 114 కేసులు, రంగారెడ్డి నుంచి 142 మరియు నల్గొండ నుంచి 183 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 18 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,281కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 3,464 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,40,986 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 34,084 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on May 31, 2021 07:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

