COVID in TS: తెలంగాణలో కొత్తగా 6,026 పాజిటివ్ కేసులు, 52 కోవిడ్ మరణాలు నమోదు.. రాష్ట్రంలో ప్రస్తుతం 77,127గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 4,75,748కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,115 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ...

COVID in TS: తెలంగాణలో కొత్తగా 6,026 పాజిటివ్ కేసులు, 52 కోవిడ్ మరణాలు నమోదు.. రాష్ట్రంలో ప్రస్తుతం 77,127గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Representational Image | (Photo Credits: PTI)

Hyderabad, May 6: తెలంగాణలో సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. రోజుకి సుమారుగా 6 వేల చొప్పున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే  వైరస్ నిర్ధారణ పరీక్షలు లక్ష కంటే తక్కువగానే జరుగుతున్నాయి. ప్రతిరోజు లక్షకు తక్కువ కాకుండా పరీక్షలు నిర్వహించాలని, అలాగే లాక్డౌన్ విధించని పక్షంలో వారాంతపు లాక్డౌన్ విధించాలని ప్రభుత్వానికి హైకోర్ట్ సూచించింది, ఈనెల 8 లోపు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించాలని హైకోర్ట్ ఆదేశించింది.

రాష్ట్రంలో కేసులను పరిశీలిస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 79,824 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 6,026 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 4,091 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 4,75,748కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,115 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 418 కేసులు, రంగారెడ్డి నుంచి 403, నల్గొండ నుంచి 368 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 52 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,579కు పెరిగింది.

అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 6,551 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,96,042 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే, ఇకపై 45 ఏళ్లు పైబడిన వారికి ప్రీ-బుకింగ్ ప్రాతిపదికన మాత్రమే టీకా లభిస్తుందని, రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కేంద్రంలోనూ నేరుగా వెళ్లి టీకా పొందలేరని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇకపై GHMC పరిధిలోని ప్రభుత్వ కేంద్రాల్లో ప్రతిరోజు 200 స్లాట్లు, ఇతర ప్రాంతాలలో 100 అందుబాటులో ఉంటాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. టీకా పొందాలనుకునే వారు కొవిన్ ద్వారా తమ స్లాట్ రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ సరఫరాకు అనుగుణంగా 45 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారికి టీకా పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 49.59 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on May 06, 2021 09:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).