COVID in Telangana: తెలంగాణలో ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 730 పాజిటివ్ కేసులు నమోదు, మరో 7 మంది మృతి. రాష్ట్రంలో 8 వేలకు చేరువైన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే పరిస్థితులు రోజురోజుకి దారుణంగా తయారవుతున్నాయి. ఆదివారం నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 659 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఆ తరువాత జనగాం జిల్లా నుంచి ఇటీవల కాలంలోనే అత్యధికంగా...

COVID in Telangana: తెలంగాణలో ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 730 పాజిటివ్ కేసులు నమోదు, మరో 7 మంది మృతి. రాష్ట్రంలో 8 వేలకు చేరువైన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య
Coronavirus Outbreak in Telangana. Representational Image. | Pixabay Pic

Hyderabad, June 22:  తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం  భారీ స్థాయిలో  730  కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.  తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 7,802కు చేరుకుంది.

ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే పరిస్థితులు రోజురోజుకి దారుణంగా తయారవుతున్నాయి.  ఆదివారం నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 659 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి.  ఆ తరువాత జనగాం జిల్లా నుంచి ఇటీవల కాలంలోనే అత్యధికంగా 34 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 10, మేడ్చల్ 9, వరంగల్ 6, ఆసిఫాబాద్ నుంచి 3, వికారాబాద్ జిల్లాల నుంచి 2 కేసులు నమోదు కాగా, సంగారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి, యాదాద్రి, నారాయణపేట్, మెదక్ మరియు నల్గొండ జిల్లాల నుంచి  ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నిర్ధారణ అయ్యాయి.

ఆదివారం మరో 7 మంది  కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 210 కు పెరిగింది.

#COVID19 Bulletin- Telangana

Status of positive cases of #COVID19 in Telangana

ఇదిలా ఉంటే, ఈరోజు మరో 225 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,731 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,861 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో 3,297 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 57,054 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Jun 22, 2020 07:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).