COVID in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 2795 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1,14,483కి చేరిన కొవిడ్ బాధితుల సంఖ్య, 788కు పెరిగిన కరోనా మరణాలు
వైరస్ వ్యాప్తి జిల్లాల నుంచి పల్లెలకు విస్తరించింది. గ్రామాల్లో కూడా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి, ఒక ఇంట్లో ఒకరికి కరోనా సోకితే వారి నుంచి ఇంట్లో వారందరికీ వైరస్ సోకుతోంది. ఈ విధంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ అర్బన్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల మరియు సిద్ధిపేట....
Hyderabad, August 27: తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 60,386 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2795 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1075 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 11,42,480 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,14,483కి చేరుకుంది.
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 449 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, అటు మేడ్చల్, రంగారెడ్డిలలో కూడా కొత్తగా నమోదయ్యే కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. నిన్న సాయంత్రం వరకు రంగారెడ్డి నుంచి నమోదైన కేసులు 268గా ఉండగా, మేడ్చల్ నుంచి 113 కేసులు నిర్ధారణయ్యాయి.
Telangana's COVID19 Bulletin:


మరోవైపు గత 24 గంటల్లో మరో 8 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 788 కు పెరిగింది.
అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 872 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 86,095 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,600 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Aug 27, 2020 09:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

