Siddipet Road Accident: సిద్దిపేటలో అదుపుతప్పి గుంతలో పడిన కారు, ఐదుగురు అక్కడికక్కడే మృతి, మరొకరికి పరిస్థితి విషమం

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగదేవ్పూర్ మండలం మునిపడ మల్లన్న ఆలయం వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు.

Siddipet Road Accident: సిద్దిపేటలో అదుపుతప్పి గుంతలో పడిన కారు, ఐదుగురు అక్కడికక్కడే మృతి, మరొకరికి పరిస్థితి విషమం
Representational Image (Credits: Facebook)

Hyd. Jan 10:  తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగదేవ్పూర్ మండలం మునిపడ మల్లన్న ఆలయం వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని హుటాహుటిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

అది హత్యా, ఆత్మహత్యా, కారులో గిరిజన వ్యక్తి సజీవ దహనం, పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టిన మెదక్ జిల్లా పోలీసులు

బోనగిరి యాదాద్రి జిల్లా బీబీనగర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు దైవదర్శనం నిమిత్తం వేములవాడకు వెళ్లి తిరుగు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను సత్తమ్మ, స్రవంతి, లోకేష్, భవ్య శ్రీ, రాజమణిగా గుర్తించారు. వెంకటేష్‌ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

(The above story first appeared on LatestLY on Jan 10, 2023 05:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).