Telangana Shocker: నడిరోడ్డుపై తండ్రిని అతి దారుణంగా చంపేసిన కొడుకు, నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం కూచన్‌పల్లిలో దారుణ ఘటన, పోలీసులపై మండి పడుతున్న స్థానికులు

నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రిని కన్నకొడుకే తండ్రిని బండరాయితో అతిదారుణంగా (Telangana Shocker) హత్యచేశాడు. డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగని పెద్ద రాజన్న, లింగవ్వ దంపతుల రెండో కుమారుడు రవి వారం క్రితం దుబాయ్‌ నుంచి వచ్చాడు. అప్పటి నుంచి తాను పంపిన డబ్బుల విషయమై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు.

Telangana Shocker: నడిరోడ్డుపై తండ్రిని అతి దారుణంగా చంపేసిన కొడుకు, నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం కూచన్‌పల్లిలో దారుణ ఘటన, పోలీసులపై మండి పడుతున్న స్థానికులు
Representational Image (Photo Credits: Pixabay)

Nirmal, Feb 28: నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రిని కన్నకొడుకే తండ్రిని బండరాయితో అతిదారుణంగా (Telangana Shocker) హత్యచేశాడు. డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగని పెద్ద రాజన్న, లింగవ్వ దంపతుల రెండో కుమారుడు రవి వారం క్రితం దుబాయ్‌ నుంచి వచ్చాడు. అప్పటి నుంచి తాను పంపిన డబ్బుల విషయమై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు.

రవి సోదరుడు రాజు వారం రోజుల క్రితమే గల్ఫ్‌ నుంచి తిరిగివచ్చాడు. మొదట అతనిపై కొడవలితో దాడి చేశాడు. సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రవిని అరెస్ట్ చేసి, మందలించి వదిలిపెట్టారు. అదే రోజు రాత్రి వదినపైకి దాడికి యత్నించాడు. ఇక అర్థరాత్రి తర్వాత తండ్రిని రాయితో మోది (Son Ends Father Life in Nirmal) చంపేశాడు. పోలీసులు నిందితుడిని కస్టడీలో ఉంచితే ఈ హత్య జరిగేదే కాదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కాగా శుక్రవారం సాయంత్రం సోదరుడు రాజు ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న అతడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడు రవిని పోలీసులు స్టేషన్‌కు తరలించి.. అర్ధరాత్రి తిరిగి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని బయటకు లాక్కొచ్చి నడిరోడ్డుపై బండరాయితో కొట్టి చంపాడు.

కుక్కపై అత్యాచారానికి తెగబడిన కామాంధుడు, మైసూరులో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన, వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన కొందరు యువకులు, నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు

మృతదేహాన్ని తరలించే క్రమంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని, సోదరుడిపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని రాత్రి వేళ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఎందుకు పంపిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వారిని డీఎస్పీ శాంతింపజేశారు.

రవి సైకో మారాడని గ్రామస్తులు పేర్కొన్నారు. వేధింపులు భరించలేక నాలుగేళ్ల క్రితం భార్య విడాకులు తీసుకుంది. మూడేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లిన రవి.. అక్కడా సహచరులతో గొడవ పడేవాడని తెలిసింది. వారి ఫిర్యాదుతో రవిని వారం క్రితం కంపెనీ ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి తల్లిదండ్రులు, సోదరుడితో గొడవ పడుతున్నాడు. మూడు రోజుల క్రితం తల్లి లింగవ్వపై కొడవలితో దాడి చేయగా.. చేతికి గాయమైంది.

(The above story first appeared on LatestLY on Feb 28, 2021 01:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).