Telangana Shocker: వీడు మనిషేనా, భార్యను గొడ్డలితో మెడపై నరికి, 3 నెలల పసికందును నీటి సంపులో పడేసిన భర్త, రక్తపు మరకలు అంటిన బట్టలతోనే పరార్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనాజ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి భర్త తన భార్యను గొడ్డలితో నరికి చంపి (Woman brutally killed by husband), 3 నెలల కుమారుడిని నీటి సంపులో పడవేసి హతమార్చాడు.
Anajpur, Mar 15: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనాజ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి భర్త తన భార్యను గొడ్డలితో నరికి చంపి (Woman brutally killed by husband), 3 నెలల కుమారుడిని నీటి సంపులో పడవేసి హతమార్చాడు. అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని అనాజ్‌పూర్‌లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండరావిరాలకు చెందిన లావణ్యకు అనాజ్ పూర్ కి చెందిన ధనరాజ్‌తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. బాలింతగా ఉన్న లావణ్య(23)ను బుధవారం మధ్యాహ్నం తన పుట్టింటి నుంచి నిద్ర చేయడం కోసం భర్త ధనరాజ్ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన కాసేపటికే భార్యతో గొడవపడిన ధనరాజ్ ఆమెను గొడ్డలితో నరికాడు.
మెడకు తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఆ తర్వాత 3 నెలల కుమారుడిని సంపులో పడేసి హతమార్చాడు. భార్య, కుమారుడిని చంపిన ధన్‌రాజ్ అందరూ చూస్తుండగానే, రక్తపు మరకలు అంటిన బట్టలతోనే పరారైయ్యాడు.
తల్లితో గొడవకు దిగిన తండ్రిని చూసి భయపడిన మూడేళ్ల కుమార్తె ఆద్య ఇంటి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కుటుంబ కలహాలతోనే ధనరాజ్ హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Mar 15, 2023 06:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

