Telangana Weather Update: తెలంగాణకు మరోసారి వర్ష ముప్పు..రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్, యెల్లో అలర్ట్‌లు జారీ చేసిన వాతావరణ శాఖ.. 20 జిల్లాలకు బిగ్ అలర్ట్..
తాజా IMD హైదరాబాద్ బులెటిన్ ప్రకారం సెప్టెంబర్ 7న తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు (30–40 kmph) వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు/ఉరుములతో కూడిన జల్లులు కొనసాగే అవకాశం ఉందని IMD తెలిపింది.
Telangana Weather Update: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు మళ్లీ పుంజుకోవడంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత రెండు రోజులుగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో, హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాబోయే గంటల నిమిత్తం ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది. రాజధాని నగరం సహా పరిసర ప్రాంతాలకు, పలు కీలక జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, మరికొన్ని ప్రాంతాలకు ‘యెల్లో అలర్ట్’ ప్రకటిస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
వాతావరణ శాఖ యొక్క తాజా నివేదిక ప్రకారం.. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రాజధాని హైదరాబాద్ మరియు మేడ్చల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షపాతం నమోదు కానుండగా, నగరంలో అక్కడక్కడా కుండపోత వానలు పడే సూచనలు ఉన్నట్లు స్పష్టం చేశారు.
నేపాల్ మృత్యుఘోష.. విపత్తు సంభవించి రోజులు గడుస్తున్నా.. ఇంకా కానరాని 600 మంది పసి పిల్లల జాడ..
రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రయాణికులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వరుస వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉన్నందున జీహెచ్‌ఎంసీ సహా అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ యంత్రాంగాలు ముందస్తు మురుగునీటి నివారణ చర్యలు చేపట్టాయి. నగర నివాసితులు మరియు వాహనదారులు అత్యవసరం అయితేనే బయటకు రావలసిందిగా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
(The above story first appeared on LatestLY on Sep 07, 2026 09:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

