Hyderabad Shocker: అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కనే వదిలి వెళ్లిన షాకింగ్ ఘటన..సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..
ఆడపిల్ల ఇంటికి బరువైపోయింది. అప్పుడే పుట్టిన పసికందును కన్న పేగు నుంచి దూరం చేసి రోడ్డు పక్కన పారేసిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన చూసిన స్థానికులంతా మానవత్వం మంట కలిసిపోయిందని షాక్ తింటున్నారు.
ఆడపిల్ల ఇంటికి బరువైపోయింది. అప్పుడే పుట్టిన పసికందును కన్న పేగు నుంచి దూరం చేసి రోడ్డు పక్కన పారేసిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన చూసిన స్థానికులంతా మానవత్వం మంట కలిసిపోయిందని షాక్ తింటున్నారు. సూరారం పోలిస్ స్టేషన్ పరిధి విశ్వ కర్మ కాలనీలో ఓ షాపు మెట్ల పై అప్పుడే పుట్టిన ఓ ఆడ శిశువు ను కవర్లో పెట్టి వెళ్ళారు గుర్తు తెలియని వ్యక్తులు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎంతకీ పోలీసుల రాకపోవడంతో చలిలో ఇబ్బంది పడుతున్న చిన్నారిని స్థానికులే చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. అయితే ఘటన స్థలంలో రక్తపు మరకలు ఉండటంతో, ఉదయం 5గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
మేడ్చల్ :
అప్పుడే పుట్టిన పసికందు ను రోడ్డు పక్కనే వదిలి వెళ్లిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది.
సూరారం పోలిస్ స్టేషన్ పరిధి విశ్వ కర్మ కాలంలో గల ఓ షాపు మెట్ల పై అప్పుడే పుట్టిన ఓ ఆడ శిశువు ను కవర్లో పెట్టీ వెళ్ళారు గుర్తు తెలియని వ్యక్తులు.
అటుగా వెళ్తున్న…
— Telangana Awaaz (@telanganaawaaz) November 17, 2024
ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టిన వారు. సామాజికంగా ఉన్నటువంటి కొన్ని దురాచారాల కారణంగా వారిని ఈ విధంగా రోడ్డు పక్కన వదిలేసి వెళ్లడం వంటి పనులు చేస్తున్నారని సామాజిక వేత్తలు పేర్కొంటున్నారు. ఆడపిల్లలకు పెళ్లిళ్లకు కట్నాలు ఇవ్వాల్సి వస్తుందని తమ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా పెంచలేమని అధిక సంతానం కారణంగా కూడా ఈ విధమైన పనులు చేస్తున్నారు అని పలు ఎన్జీవో సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ప్రభుత్వం నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠినమైన చట్టాలను తేవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Nov 17, 2024 12:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

