Vikarabad: తెలంగాణలో కల్తీ కల్లు కల్లోలం, వికారాబాద్‌లో దాదాపు 200 మందికి పైగా అస్వస్థత, ఒకరు మృతి, కల్లు దుకాణాలు, డిపోను సీజ్ చేసిన అధికారులు, ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపిన ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఖురేషీ

తెలంగాణలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. వికారాబాద్‌ జిల్లాలో కల్తీ కల్లు (Vikarabad spurious alcohol) సేవించి ఓ వ్యక్తి మృతి చెందగా దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అక్కడ కలకలం రేపుతోంది. కల్లు తాగిన బాధితులు (drinking spurious Toddy) ఉన్నట్టుండి కళ్లు తిరిగి కింద పడిపోవడం.. వాంతులు, మూర్చతో గిలగిలా కొట్టుకోవడం చూసి జనం బెంబేలెత్తిపోయారు. వెంటనే వారిని వికారాబాద్, హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు.

Vikarabad: తెలంగాణలో కల్తీ కల్లు కల్లోలం, వికారాబాద్‌లో దాదాపు 200 మందికి పైగా అస్వస్థత, ఒకరు మృతి, కల్లు దుకాణాలు, డిపోను సీజ్ చేసిన అధికారులు, ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపిన ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఖురేషీ
spurious toddy (Photo-PTI)

Vikarabad, Jan 10: తెలంగాణలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. వికారాబాద్‌ జిల్లాలో కల్తీ కల్లు (Vikarabad spurious alcohol) సేవించి ఓ వ్యక్తి మృతి చెందగా దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అక్కడ కలకలం రేపుతోంది. కల్లు తాగిన బాధితులు (drinking spurious Toddy) ఉన్నట్టుండి కళ్లు తిరిగి కింద పడిపోవడం.. వాంతులు, మూర్చతో గిలగిలా కొట్టుకోవడం చూసి జనం బెంబేలెత్తిపోయారు. వెంటనే వారిని వికారాబాద్, హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు.

చిట్టిగిద్ద గ్రామం (Chittigidda Village) నుంచి రోజూ కల్లు సరఫరా అయ్యే వికారాబాద్‌, నవాబుపేట మండలాల్లోని గ్రామాల్లో కల్లు తాగేవారే తీవ్ర అస్వస్థతకు గురి కావడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. వికారాబాద్‌ మండలంలో దాదాపు 110మంది, నవాబుపేట మండలంలో దాదాపు 102మంది అస్వస్థతకు గురయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ రెండు మండలాల్లోని 18 గ్రామాలకు చిట్టిగిద్ద నుంచి కల్లు సరఫరా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 11 కల్లు దుకాణాలు, ఒక డిపోను అధికారులు సీజ్‌ చేశారు.

ఈ డిపో పరిధిలో దాదాపు 200 మంది అస్వస్థతకు గురి కాగా. పెండ్లిమడుగు గ్రామానికి చెందిన కిష్టారెడ్డి మృతి చెందాడు. ఆయా ఆస్పత్రుల్లో 57 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు వైద్యశాఖాధికారులు తెలిపారు. పెండ్లిమడుగుకు చెందిన కిష్టారెడ్డి కల్తీ కల్లు కారణంగానే మృతి చెందాడా? లేదా అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణలో విషాదకర ఘటన, కల్తీ కల్లు తాగి 30 మందికి అస్వస్థత, ఒకరి పరిస్థితి విషమం, బాధిత కుటుంబాలను పరామర్శించిన వికారాబాద్, చేవెళ్ల ఎమ్మెల్యేలు

ఇదిలా ఉంటే కల్లు సేవించిన వారి అస్వస్థతకు మత్తు మందు కారణమని తెలుస్తోంది. మత్తు మోతాదు తక్కువ అయితే కల్లుతాగిన వారిలో విత్‌డ్రావల్‌ లక్షణాలు కనిపిస్తాయని, ప్రస్తుతం వీరంతా ఈ లక్షణాల కారణంగానే అస్వస్థతకు గురయ్యారని అధికారులు చెబుతున్నారు. కాగా, కల్తీ కల్లు తాగడం వల్లే ఇలా జరిగిందని ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఖురేషీ తెలిపారు. కల్లు శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. కల్తీకల్లుగా నిర్ధారణ అయితే డిపో నిర్వాహకులపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, రైతు కిష్టారెడ్డి కల్లు తాగి మృతి చెందడంపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సంజీవరావు తెలిపారు.

వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని శనివారం మంత్రి సబితారెడ్డి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి సూచించారు. శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు పేర్కొన్నారు.

(The above story first appeared on LatestLY on Jan 10, 2021 11:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).