CM Revanth Reddy On Mamunur Airport: మహానగరంగా వరంగల్..మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణపై దృష్టి సారించాలన్న సీఎం రేవంత్ రెడ్డి...హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం

వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంగా ఎదగడానికి వీలుగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy On Mamunur Airport: మహానగరంగా వరంగల్..మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణపై దృష్టి సారించాలన్న సీఎం రేవంత్ రెడ్డి...హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం
Warangal must turn mega city says CM Revanth Reddy(CMO X)

Hyd, January 10:  వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంగా ఎదగడానికి వీలుగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ‌రంగ‌ల్ (మామునూరు) విమానాశ్ర‌య భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి.

టెక్స్‌టైల్స్‌తో పాటు ఐటీ, ఫార్మా, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధితో హైద‌రాబాద్‌ను ప్ర‌తిబింబించేలా వ‌రంగ‌ల్ ఎదిగేలా ప్ర‌ణాళిక‌లు ఉండాల‌ని అన్నారు. వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం పూర్త‌యితే మేడారం జాత‌ర‌తో పాటు ల‌క్న‌వ‌రం, రామ‌ప్ప ఇత‌ర ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు వ‌చ్చే ప్ర‌జ‌లు సైతం దానినే వినియోగించుకుంటార‌ని సీఎం తెలిపారు.

ఆయా దేశాల పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం ఉండాల‌ని, ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు త‌మ పెట్టుబ‌డుల‌కు విమానాశ్ర‌యాలను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయ‌ని ముఖ్య‌మంత్రి గారు వివరించారు.కొచ్చి విమానాశ్ర‌యం అన్ని వ‌స‌తుల‌తో ఉంటుంద‌ని, దానిని ప‌రిశీలించాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు. వ‌రంగ‌ల్ అవుట‌ర్ రింగు రోడ్డు, రేడియ‌ల్ రోడ్లు విమానాశ్ర‌యానికి అనుసంధానంగా ఉండాల‌ని చెప్పారు.  మణికొండలో హైడ్రా కూల్చివేతలు.. నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ లో కూల్చివేతలు (వీడియో)

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాతో పాటు ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్‌, న‌ల్గొండ జిల్లాల ప్ర‌జ‌లు భ‌విష్య‌త్‌లో వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం నుంచే రాక‌పోక‌లకు వీలుగా ర‌హ‌దారులు నిర్మించేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ఆదేశించారు.

(The above story first appeared on LatestLY on Jan 10, 2025 10:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).