COVID19 in Telangana: తెలంగాణలో గడిచిన ఒక్కరోజులో కొత్తగా 142 పాజిటివ్ కేసులు, కోవిడ్‌తో మరో ఇద్దరు మృతి, రాష్ట్రంలో 1769గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది, అయితే దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే రోజూవారీ కేసులు తక్కువగానే ఉంటున్నాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 32,189 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 142 మందికి పాజిటివ్ అని తేలింది....

COVID19 in Telangana: తెలంగాణలో గడిచిన ఒక్కరోజులో కొత్తగా 142 పాజిటివ్ కేసులు, కోవిడ్‌తో మరో ఇద్దరు మృతి, రాష్ట్రంలో 1769గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Coronavirus Outbreak| (Photo Credits: IANS)

Hyderabad, March 9:  తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది, అయితే దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే రోజూవారీ కేసులు తక్కువగానే ఉంటున్నాయి.  నిన్న రాత్రి 8 గంటల వరకు 32,189 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 142 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 624 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,00,153కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 31 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 10, మరియు రంగారెడ్డి నుంచి 12 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,644కు పెరిగింది.

మరోవైపు సోమవారం సాయంత్రం వరకు మరో 178 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,96,740 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1769 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Mar 09, 2021 10:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).