Apple's WWDC: యాపిల్ కొత్త ఆవిష్కరణల కోసం చూస్తున్నారా..అయితే జూన్ 10న జరగనున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌పై ఓ లుక్కేసుకోండి
Apple's Worldwide Developers Conference Dates: Apple తన వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)ని ఆన్‌లైన్‌లో జూన్ 10 నుండి 14, 2024 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. డెవలపర్‌లు, విద్యార్థులు ప్రారంభ రోజున Apple పార్క్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉంటుంది.డెవలపర్‌లందరికీ ఇది ఉచితం. ఆసక్తి ఉన్న వాళ్లు యాపిల్ డెవలపర్ యాప్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. WWDC24 తాజా iOS, iPadOS, macOS, watchOS, tvOS, visionOS పురోగతిని తెలియజేస్తుంది. కొత్త ఆదాయపు పన్ను విధానంపై కేంద్రం క్లారిటీ, నేటి నుంచి ఎస్బీఐ డెబిట్ కార్డు చార్జీల మోత, ఏప్రిల్ 1 నుంచి జరిగే మార్పులు ఇవే..
యాపిల్ తీసుకురానున్న సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లలో ఏఐ ఫీచర్లను జోడించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. క్లౌడ్ ఆధారిత జనరేటివ్ ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు గూగుల్, బైదూ.. వంటి ఏఐ సంస్థలతో భాగస్వామ్యం గురించి సమాచారం అందొచ్చని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. ఇక iOS 18, iPadOS 18, macOS 15, watchOS 11, tvOS 18లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ (OS) వివరాలను పరిచయం చేస్తారని తెలిసింది. ఇక ఐపాడ్ ఎయిర్, ఓఎల్‌ఈడీ ఐపాడ్ ప్రోలో కొత్త మోడల్స్‌ను లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం.
(The above story first appeared on LatestLY on Apr 01, 2024 06:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

