Itel A50, Itel A50C: ఐటెల్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్లు, ధర, ఫీచర్లు ఇతర వివరాలు ఇవిగో..

యూనిసోక్ టీ603 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్లలో 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరాలు, ఐటెల్ ఏ50 ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఐటెల్ ఏ50సీ ఫోన్ 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి. నోటిఫికేషన్లు, ఇతర సమాచారం కోసం ఐ-ఫోన్లలో మాదిరిగా డైనమిక్ బార్ ఫీచర్ కూడా ఉంటుంది.

Itel A50, Itel A50C: ఐటెల్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్లు, ధర, ఫీచర్లు ఇతర వివరాలు ఇవిగో..
Itel A50, Itel A50C (Photo-Itel)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం ఐటెల్ (Itel) తన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్లు – ఐటెల్ ఏ50 (Ite A50), ఐటెల్ ఏ50సీ (Itel A50C) ఫోన్లను భారత్ మార్కెట్లో మంగళవారం విడుదల చేసింది. యూనిసోక్ టీ603 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్లలో 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరాలు, ఐటెల్ ఏ50 ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఐటెల్ ఏ50సీ ఫోన్ 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి. నోటిఫికేషన్లు, ఇతర సమాచారం కోసం ఐ-ఫోన్లలో మాదిరిగా డైనమిక్ బార్ ఫీచర్ కూడా ఉంటుంది.

ఐటెల్ ఏ50 ఫోన్ 3జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ రూ.6,099, 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ రూ.6,499 పలుకుతుంది. సియాన్ బ్లూ, మిస్ట్ బ్లాక్, లైమ్ గ్రీన్, షిమ్మర్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం అమెజాన్ ద్వారా సేల్స్ ప్రారంభం అయ్యాయి. ఐటెల్ ఏ50సీ ఫోన్ 2 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.5,699 పలుకుతుంది. ఈ ఫోన్ డాన్ బ్లూ, మిస్ట్ ఆక్వా, సఫైర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ డౌన్, జీమెయిల్, సెర్చ్, యూట్యూబ్ యాక్సెస్ చేయలేకపోతున్నామంటూ గగ్గోలు పెడుతున్న నెటిజన్లు

ఐటెల్ ఏ50, ఐటెల్ ఏ50సీ ఫోన్లు రెండు ఆండ్రాయిడ్ 14 (గో ఎడిషన్) వర్షన్ పై పని చేస్తాయి. ఐటెల్ ఏ50 ఫోన్ 6.56 అంగుళాల డిస్ ప్లే, ఐటెల్ ఏ50సీ ఫోన్ 6.6 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటాయి. కాల్స్, బ్యాటరీ స్టేటస్ తదితర విషయాలు తెలిపే నోటిఫికేషన్ల కోసం డైనమిక్ బార్ ఫీచర్ జత చేశారు. రెండు మోడల్ ఫోన్లూ ఒక్టాకోర్ యూనిసోక్ టీ603 ప్రాసెసర్‌తో పని చేస్తాయి. 4జీబీ ర్యామ్ ఫోన్లలో మెమొరీ ఫ్యూషన్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. 4జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా 8 జీబీ వరకూ పొడిగించుకోవచ్చు.

ఐటెల్ ఏ50, ఐటెల్ ఏ50సీ ఫోన్లలో ఏఐ బ్యాక్డ్ 8-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా, 5-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్‌కు మద్దతుగా ఉంటుంది. ఐటెల్ ఏ50 ఫోన్ 10వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఐటెల్ ఏ50సీ ఫోన్ 5వాట్ల చార్జింగ్ మద్దతుతో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వచ్చాయి.

(The above story first appeared on LatestLY on Aug 13, 2024 05:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).