Jio Anniversary Offer: జియో 10వ వార్షికోత్సవ ఆఫర్.. రూ.1,499లకే 4జీ ఫోన్ తో పాటు 6 నెలల ఉచిత సేవలు..
దేశంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టి, కనెక్టివిటీని సామాన్యుడికి సైతం చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న రిలయన్స్ జియో తమ 10వ వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం ఒక దిమ్మతిరిగే ఆఫర్‌ను ప్రకటించింది.
Jio Anniversary Offer: దేశంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టి, కనెక్టివిటీని సామాన్యుడికి సైతం చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న రిలయన్స్ జియో తమ 10వ వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం ఒక దిమ్మతిరిగే ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికీ 2జీ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్న కోట్లాది మంది వినియోగదారులను 4జీ ప్రపంచంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా జియో భారత్ 4జీ (JioBharat 4G) ఫోన్‌పై ఈ ధమాకా ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
రూ.1,499 ప్యాకేజీలో లభించే ప్రయోజనాలు:
ఈ వార్షికోత్సవ ఆఫర్ కింద రూ.1,499 చెల్లించి జియో భారత్ 4జీ ఫోన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు వరుసగా ఆరు నెలల పాటు ఉచిత కనెక్టివిటీ ప్రయోజనాలు లభిస్తాయి.
డేటా & కాలింగ్: ప్రతి నెలా 14 జీబీ 4జీ డేటాతో పాటు ఉచితంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది.
ఆదా అయ్యే ఖర్చు: సాధారణంగా 2జీ ఫీచర్ ఫోన్ వాడేవారు నెలకు రూ.199 రీఛార్జ్ చేసుకుంటే ఆరు నెలలకు సుమారు రూ.1,200 వరకు ఖర్చవుతుంది. కానీ జియో అందిస్తున్న ఈ ప్యాకేజీలో ఆరు నెలల ప్లాన్ పోను, సరికొత్త 4జీ ఫోన్ వినియోగదారులకు కేవలం రూ.299లకే దక్కుతున్నట్లు లెక్క. రూ. 100 లోపే ఆకట్టుకునే జియో ప్లాన్లు ఇవిగో.. ఓటీటీ, లైవ్ టీవీ ప్రియుల కోసం సరసమైన ధరల్లో ప్రత్యేక ఆఫర్లు..
ఫీచర్ ఫోన్‌లోనే స్మార్ట్ సదుపాయాలు:
జియో భారత్ ఫోన్ కేవలం కాలింగ్, మెసేజ్‌లకే పరిమితం కాకుండా అనేక అధునాతన డిజిటల్ ఫీచర్లతో వస్తుంది.
500కి పైగా టీవీ ఛానళ్లు: జియో టీవీ యాప్ ద్వారా లైవ్ క్రికెట్, సినిమాలు, రకరకాల ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లను ఉచితంగా వీక్షించవచ్చు.
జియోపే (JioPay) UPI చెల్లింపులు: డిజిటల్ పేమెంట్స్ చేసుకునేందుకు యూపీఐ సదుపాయం, పేమెంట్ అలర్ట్స్ మరియు సౌండ్ బాక్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
సేఫ్టీ & డిస్ప్లే: కుటుంబ సభ్యుల భద్రత కోసం లొకేషన్ మానిటరింగ్ సదుపాయంతో పాటు, 2.4 అంగుళాల డిస్‌ప్లే, రోజంతా నిలిచే 2000mAh శక్తివంతమైన బ్యాటరీని ఈ ఫోన్ కలిగి ఉంది.
భారతదేశంలో ఇంకా 2జీ నెట్‌వర్క్‌పైనే ఆధారపడిన వినియోగదారులు చాలా తక్కువ ఖర్చుతో డిజిటల్ సేవలకు అప్‌గ్రేడ్ అవ్వడానికి జియో తీసుకొచ్చిన ఈ ఆఫర్ ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
(The above story first appeared on LatestLY on Oct 01, 2026 05:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

