New SIM Card Rules: జనవరి 1 నుంచి సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్స్, పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ విధానానికి స్వస్తి, డిజిటల్‌ వెరిఫికేషన్‌ అందుబాటులోకి..

సిమ్‌ కార్డుల జారీకి సంబంధించి జనవరి 1 2023 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు అనుసరిస్తున్న పేపర్‌ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ విధానాన్ని టెలికాం విభాగం నిలిపివేసింది. దీని స్థానంలో వచ్చే ఏడాది నుంచి డిజిటల్‌ వెరిఫికేషన్‌ను తీసుకొస్తోంది.

New SIM Card Rules: జనవరి 1 నుంచి సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్స్, పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ విధానానికి స్వస్తి, డిజిటల్‌ వెరిఫికేషన్‌ అందుబాటులోకి..
SIM Card (Photo Credits: Twitter)

New SIM Card Rules from January 1: సిమ్‌ కార్డుల జారీకి సంబంధించి జనవరి 1 2023 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు అనుసరిస్తున్న పేపర్‌ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ విధానాన్ని టెలికాం విభాగం నిలిపివేసింది. దీని స్థానంలో వచ్చే ఏడాది నుంచి డిజిటల్‌ వెరిఫికేషన్‌ను తీసుకొస్తోంది.ఈ నిర్ణయం పట్ల ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌ ఐడియా కంపెనీలు సంతోషం వ్యక్తంచేస్తున్నాయి. దీనివల్ల సిమ్‌ కార్డుల మోసాలను సైతం అరికట్టొచ్చని కేంద్రం భావిస్తోంది.

సిమ్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ ఇవిగో, పాటించకుంటే రూ.10 లక్షల వరకు జరిమానా

ప్రస్తుతం సిమ్‌ కార్డుల జారీకి ఫారం నింపాల్సి ఉంటుంది. దీనికి గుర్తింపు పత్రాలు, ఫొటోలు జత చేయాలి. కొన్ని కంపెనీలు మాత్రం ఇప్పటికే డిజిటల్‌ విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో డిజిటల్‌గా మార్చనున్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న కేవైసీ నిబంధనల్లో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్లు టెలికాం విభాగం ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది. కాగా 2012 నుంచి పేపర్‌ విధానం అనుసరిస్తోంది. కొత్త రూల్స్ ప్రకారం.. కంపెనీలు ఇకపై పూర్తిగా మొబైల్‌ ద్వారానే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

(The above story first appeared on LatestLY on Dec 06, 2023 07:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).