New SIM Card Rules: సిమ్ కార్డులు పొందడం ఇకపై చాలా ఈజీ, కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన డిఓటీ, పూర్తి వివరాలు ఇవిగో..

మొబైల్ సిమ్ కార్డులను కొనుగోలు చేసే నియమాలు సులభతరం అయ్యాయి. ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వోడా ఫోన్, ఐడియా కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఇకపై ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ (డిఓటీ) ఇప్పుడు దీన్ని పూర్తిగా పేపర్ లెస్ గా మార్పు చేసింది.

New SIM Card Rules: సిమ్ కార్డులు పొందడం ఇకపై చాలా ఈజీ, కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన డిఓటీ, పూర్తి వివరాలు ఇవిగో..
Representative Image

మొబైల్ సిమ్ కార్డులను కొనుగోలు చేసే నియమాలు సులభతరం అయ్యాయి. ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వోడా ఫోన్, ఐడియా కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఇకపై ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ (డిఓటీ) ఇప్పుడు దీన్ని పూర్తిగా పేపర్ లెస్ గా మార్పు చేసింది.

వినియోగదారులు కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాలనుకున్నా లేక ఆపరేటర్‌ని మార్చాలని ఆలోచిస్తున్నా ఇకపై టెలికాం కంపెనీ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా నుండి సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది. వినియోగదారుల వ్యక్తిగత పత్రాలతో మోసాన్ని నిరోధించడంతో పాటు, డిజిటల్ ఇండియా కింద పూర్తిగా కాగిత రహిత వ్యవస్థను అమలు చేయనున్నారు. ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన ఆన్‌లైన్ డెలివరీ సంస్థ డంజో, ఆర్థిక మాంద్య భయాలే కారణం

ఇప్పుడు టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ వినియోగదారుల కోసం ఇ – కెవైసీ (నో యువర్ కస్టమర్) అలాగే సెల్ప్ కేవైసీని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. వినియోగదారులు తమ నంబర్‌ను ప్రీపెయిడ్ నుండి పోస్టు పెయిడ్‌కి మార్చుకోవడానికి కూడా టెలికాం ఆపరేటర్ వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. వినియోగదారులు ఇప్పుడు ఓటీపీ అధారంగా సేవ ప్రయోజనాలను పొందవచ్చు. వన్ టైమ్ పాస్‌వర్డ్ తోనే ఎటువంటి ఫోటో కాపీ లేదా పత్రాన్ని భాగస్వామ్యం చేయకుండా కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేయవచ్చు.

(The above story first appeared on LatestLY on Sep 17, 2024 09:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).