Samsung Galaxy S21 FE 5G: శాంసంగ్ నుంచి నయా 5జీ ఫోన్, గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ను విడుదల చేసిన దక్షిణ కొరియా దిగ్గజం, ధర రూ. రూ.49,999 నుంచి ప్రారంభం
ప్రముఖ దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్‌లోకి గెలాక్సీ సిరీస్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫోన్ విడుదల చేసింది ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్9, ఆసుస్ రాగ్ ఫోన్ 5 స్మార్ట్‌ఫోన్లకు పోటీగా నిలిస్తుందని కంపెనీ తెలిపింది.
ప్రముఖ దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్‌లోకి గెలాక్సీ సిరీస్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫోన్ విడుదల చేసింది ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్9, ఆసుస్ రాగ్ ఫోన్ 5 స్మార్ట్‌ఫోన్లకు పోటీగా నిలిస్తుందని కంపెనీ తెలిపింది. భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ధర రూ. రూ.49,999 నుంచి ప్రారంభంకానుంది. ఈ మొబైల్ కోసం ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే మొదలయ్యాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy S21 FE 5G) జనవరి 11 నుంచి శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉండనుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5,000 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను శాంసంగ్ అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ వైట్, గ్రాఫైట్, ఆలివ్ కలర్ వేరియంట్లలో కొనుగోలుదారులకు లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 8GBర్యామ్+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ల్లో లభించనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫీచర్లు
6.4-అంగుళాల AMOLED 2X డిస్‌ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్
ఎక్సినోస్ 2100 ప్రాసెసర్
8GBర్యామ్+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్
12ఎంపీ+12ఎంపీ+8ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
32-ఎంపీ ఫ్రంట్ కెమెరా
ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్
డ్యూయల్-రికార్డింగ్ మోడ్
4,500mAh బ్యాటరీ
25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
(The above story first appeared on LatestLY on Jan 11, 2022 01:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

