SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు అలర్ట్.. ఫ్రీ ATM ట్రాన్సాక్షన్ల పరిమితి సగానికి కోత..
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం 'భారతీయ స్టేట్ బ్యాంక్' (SBI) తన శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో లభించే ఉచిత లావాదేవీల పరిమితిని సగానికి తగ్గిస్తూ బ్యాంక్ తాజాగా సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నూతన నిబంధనలు 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
SBI ATM Rules 2026: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం 'భారతీయ స్టేట్ బ్యాంక్' (SBI) తన శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో లభించే ఉచిత లావాదేవీల పరిమితిని సగానికి తగ్గిస్తూ బ్యాంక్ తాజాగా సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నూతన నిబంధనలు 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ ఖాతాదారులు ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలు లేదా క్యాష్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్లలో నెలకు 10 ఉచిత లావాదేవీలు చేసుకునే అవకాశం ఉంది. అయితే సవరించిన నిబంధనల ప్రకారం ఈ ఉచిత లావాదేవీల సంఖ్యను 5కు పరిమితం చేశారు. నిర్ణీత పరిమితి దాటిన తర్వాత ఇతర ఏటీఎంలలో చేసే ప్రతి నగదు ఉపసంహరణకు రూ. 23తో పాటు జీఎస్టీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ లేదా మినీ స్టేట్‌మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలకు రూ. 11తో పాటు జీఎస్టీని రుసుముగా వసూలు చేయనున్నారు.
అయితే ఈ నిబంధన కేవలం ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగించినప్పుడు మాత్రమే వర్తిస్తుందని ఎస్బీఐ యాజమాన్యం స్పష్టం చేసింది. ఎస్బీఐ సొంత ఏటీఎంలలో చేసే లావాదేవీలపై శాలరీ ఖాతాదారులకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని, పాత వెసులుబాటు యథాతథంగా కొనసాగుతుందని వివరించింది. అలాగే సాధారణ సేవింగ్స్ ఖాతాదారులకు ఈ కొత్త చార్జీలతో సంబంధం లేదని, వారికి పాత నిబంధనలే అమలవుతాయని బ్యాంకు యాజమాన్యం వెల్లడించింది.
(The above story first appeared on LatestLY on Sep 03, 2026 04:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

