Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, ఏకంగా 800కు పైగా పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, ఈ షేర్లు మాత్రం లాభాల బాటలో..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీనికితోడు ద్రవ్యోల్బణ గణాంకాలు, విదేశీ మదుపర్ల విక్రయాల ధోరణీ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
Mumbai, JAN 13: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీనికితోడు ద్రవ్యోల్బణ గణాంకాలు, విదేశీ మదుపర్ల విక్రయాల ధోరణీ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ వారంలో వెలువడనున్న ఇన్ఫోసిస్ (Infosys), రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజాల త్రైమాసిక ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 23,200 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.
ప్రారంభంలోనే నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు (Stock Market).. ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో కాస్త కోలుకున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ (SENSEX) 564 పాయింట్లు కుంగి 76,841 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (NIFTY) 180 పాయింట్లు తగ్గి 23,250 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టైటాన్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అల్ట్రా టెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇండస్ ఇండ్‌బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభాల్లో కదలాడుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 80.93 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,714 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.27 వద్ద కొనసాగుతోంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు అదే బాటలో పయనిస్తున్నాయి. జపాన్ నిక్కీ, ఏఎస్‌ఎక్స్, హాంగ్‌సెంగ్ సూచీలు 1 శాతం మేర నష్టపోయాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ శుక్రవారం నాడు విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) నికరంగా రూ.2,255 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.3,962 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.
(The above story first appeared on LatestLY on Jan 13, 2025 10:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

