Truecaller Unveils Web Version: ట్రూకాలర్ నుంచి కొత్త ఫీచర్, ఇకపై యూజర్లు డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌ ద్వారా కూడా లాగిన్ కావొచ్చు, ఎలా చేయాలంటే..

ట్రూకాలర్‌ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్‌వెబ్‌, టెలిగ్రామ్‌ వెబ్‌ మాదిరిగానే ‘ట్రూకాలర్‌ వెబ్‌’ వెర్షన్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా కాంటాక్ట్‌లిస్ట్‌లో లేని మొబైల్‌ నంబర్‌ను డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌లోనూ సెర్చ్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు

Truecaller Unveils Web Version: ట్రూకాలర్ నుంచి కొత్త ఫీచర్, ఇకపై యూజర్లు డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌ ద్వారా కూడా లాగిన్ కావొచ్చు, ఎలా చేయాలంటే..
Truecaller Unveils Web Version

ట్రూకాలర్‌ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్‌వెబ్‌, టెలిగ్రామ్‌ వెబ్‌ మాదిరిగానే ‘ట్రూకాలర్‌ వెబ్‌’ వెర్షన్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా కాంటాక్ట్‌లిస్ట్‌లో లేని మొబైల్‌ నంబర్‌ను డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌లోనూ సెర్చ్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఎస్‌ఎంఎస్‌, ఛాట్‌ మిర్రరింగ్‌, కాల్‌నోటిఫికేషన్‌ ఫీచర్లు కూడా వెబ్‌ వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకసారి లింక్‌ చేసిన డివైజ్‌ డీలింక్‌ చేయకపోతే 30 రోజుల్లో ఆటోమెటిక్‌గా సైన్‌అవుట్‌ అవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ వినియోదారులకే అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. చైనాకు యాపిల్ షాక్, భారత్‌లో ఐపోన్ల ఉత్పత్తిని డబుల్ రెట్టింపు చేసిన కంపెనీ, పెట్టుబడుల ఆకర్షణకు PLI పథకాన్ని ప్రవేశపెట్టిన భారత్

ఎలా కనెక్ట్‌ అవ్వాలంటే..

యూజర్లు ముందుగా డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌ బ్రౌజర్‌లోకి వెళ్లి వాట్సప్‌వెబ్‌, టెలిగ్రామ్‌ వెబ్‌ లాగే ట్రూకాలర్‌వెబ్‌ అని టైప్‌చేయాలి. లింక్‌డివైజ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసిన వెంటన్‌ వేరే పేజ్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది. ఏ మొబైల్‌ తరఫున లాగిన్‌ చేయాలో ఆ ఫోన్‌ ఆన్‌చేసి ట్రూకాలర్‌ యాప్‌లోకి వెళ్లాలి. అందులో మెసేజెస్‌ విభాగంలో త్రిడాట్‌ మెను ఉంటుంది. దానిపై క్లిక్‌ చేయాలి. అందులో ‘ట్రూకాలర్‌ ఫర్‌ వెబ్‌’పై ప్రెస్‌ చేయాలి. లింక్‌ డివైజ్‌ అనే అప్షన్‌ కనిపిస్తుంది. దాని ద్వారా డెస్క్‌టాప్‌పై కనిపిస్తున్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. క్షణాల్లో ఫోన్‌ యాప్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌తో లింక్‌ అవుతుంది.

(The above story first appeared on LatestLY on Apr 11, 2024 12:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).