 
                                                                 Dubai/Mascut, July 17:ఒమన్‌ను వరుస విషాదాలు వెంటాడాయి. మంగళవారం ఒమన్ రాజధాని మస్కట్‌లోని ఓ మసీదు వద్ద కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా ఇందులో ఒక భారతీయుడు ఉన్నారు. ఈ దాడులకు తెగబడ్డ ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు హతమార్చాయి.
ఈ ఘటన మరవక ముందే ఒమన్ సముద్ర తీరంలో మరోవిషాదం చోటు చేసుకుంది. కొమోరోస్ జెండాతో వెళ్తున్న చమురు నౌక బొల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది గల్లంతు కాగా 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంకకు చెందిన వారున్నారు. మునిగిపోయిన నౌకను ప్రెస్టీజ్ పాల్కాన్‌గా గుర్తించారు.
ఆయిల్ ట్యాంకర్ మునిగిపోవడానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు అధికారులు.ఓడ మునిగి తలకిందులు కావడంతో సిబ్బంది గల్లంతయ్యారని తెలిపారు. అయితే నౌక మునగడం అందులోని చమురు లీకవుతుందా అన్న వివరాలను అధికారులు వెల్లడించలేదు. దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏ చిన్న పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించిన వేలు, లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
