Suzuki Chairman Osamu Suzuki Dies: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఒసాము సుజుకి కన్నుమూత, కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఒసాము..పలువురి సంతాపం
సుజుకీ మోటార్స్ మాజీ ఛైర్మన్ ఒసాము సుజుకి కన్నుమూశారు. ఆయన వయస్సు 94. కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారని సుజుకి మోటార్స్ కంపెనీ వెల్లడించింది.
Delhi, December 27: సుజుకీ మోటార్స్ మాజీ ఛైర్మన్ ఒసాము సుజుకి కన్నుమూశారు. ఆయన వయస్సు 94. కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారని సుజుకి మోటార్స్ కంపెనీ వెల్లడించింది.
28 సంవత్సరాలకు పైగా సుజుకి మోటార్స్‌కి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇలా ఒక ప్రపంచ ఆటోమేకర్ కంపెనీకి ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఒసాము. జూన్ 2015లో ఆయన తన వారసుడిగా కుమారుడికి బాధ్యతలు అప్పజెప్పారు. విమాన ప్రయాణీకులకు అలర్ట్..ఇకపై ఒక క్యాబిన్ బ్యాగుకు మాత్రమే అనుమతి...నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పదు...పూర్తి వివరాలివే
జపాన్‌లో 1930 జనవరి 30న జన్మించారు ఒసాము. 1958లో ఆటోమేకర్ రంగంలో అడుగుపెట్టిన ఆయన చిన్న కార్లు, మోటార్ సైకిళ్లను పరిచయం చేసి దాన్ని బ్రాండ్‌గా మార్చేశాడు. కంపెనీ స్థాపించిన 41 సంవత్సరాల తర్వాత తన 91వ ఏట రిటైర్మెంట్ ప్రకటించారు. 2015లో సుజుకి అధ్యక్ష పదవిని తన కుమారుడికి అప్పగించారు.
(The above story first appeared on LatestLY on Dec 27, 2024 03:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

