US Bill Could Halt H-1B Visas For 3 Years: అమెరికాలో కొత్త బిల్లు.. హెచ్-1బీ వీసాలకు 3 ఏళ్ల బ్రేక్? భారతీయుల్లో ఆందోళన..

అమెరికాలో పని చేయాలని లేదా స్థిరపడాలని భావిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులకు ఆందోళన కలిగించే దిశగా యూఎస్ సెనేట్‌లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్-1బి (H-1B) వీసా ప్రక్రియలో మార్పులు ప్రతిపాదిస్తూ మోంటానాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షీహీ.. ఎండ్ హెచ్-1బి అబ్యూస్ యాక్ట్' (End H-1B Abuse Act) పేరుతో ఒక బిల్లును ప్రవేశపెట్టారు.

US Bill Could Halt H-1B Visas For 3 Years: అమెరికాలో కొత్త బిల్లు.. హెచ్-1బీ వీసాలకు 3 ఏళ్ల బ్రేక్? భారతీయుల్లో ఆందోళన..
US Visa H1B (Photo Credits: File Image)

US Bill Could Halt H-1B Visas For 3 Years: అమెరికాలో పని చేయాలని లేదా స్థిరపడాలని భావిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులకు ఆందోళన కలిగించే దిశగా యూఎస్ సెనేట్‌లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్-1బి (H-1B) వీసా ప్రక్రియలో మార్పులు ప్రతిపాదిస్తూ మోంటానాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షీహీ.. ఎండ్ హెచ్-1బి అబ్యూస్ యాక్ట్' (End H-1B Abuse Act) పేరుతో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటం.. తక్కువ వేతనాల విదేశీ కార్మికులతో స్థానిక ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని అడ్డుకోవడం, వీసా మోసాలను అరికట్టడమే ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రతిపాదిత చట్టంలో పొందుపరిచిన అంశాలు ఆమోదం పొందితే H-1B వీసా వ్యవస్థ స్వరూపమే మారిపోతుంది. అందులో ముఖ్యమైనవి:

కొత్త వీసాలపై మూడేళ్ల నిషేధం: అన్ని రకాల కొత్త H-1B వీసాల జారీని మూడేళ్ల పాటు పూర్తిగా నిలిపివేయడం.

భారీ పిటిషన్ రుసుము: ప్రతి H-1B పిటిషన్‌పై ఏకంగా 1,00,000 డాలర్ల (సుమారు రూ. 96 లక్షలు) రుసుమును విధిస్తూ కాంగ్రెస్ ద్వారా చట్టబద్ధత కల్పించడం.

ఎంపిక విధానంలో మార్పు: ప్రస్తుత లాటరీ విధానాన్ని రద్దు చేసి, అత్యధిక వేతనాలు ఇచ్చే ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇచ్చే వేతన ఆధారిత విధానాన్ని తీసుకురావడం.

నిషేధాలు & ఆంక్షలు: ఒకేసారి పలు యజమానుల వద్ద పనిచేసే విధానాన్ని, థర్డ్-పార్టీ స్టాఫింగ్ ఏజెన్సీల ప్రాసెస్ ప్రక్రియను పూర్తిగా నిషేధించడం.

గ్రీన్ కార్డ్, డిపెండెంట్ దారులకు కోత: H-1B హోల్డర్లు గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తూనే యూఎస్‌లో పనిచేసే 'డ్యూయల్ ఇంటెంట్' నిబంధనను రద్దు చేయడం మరియు వీసాదారులు తమ కుటుంబ సభ్యులను (డిపెండెంట్లు) అమెరికాకు తీసుకురాకుండా నిరోధించడం.

OPT రద్దు: అంతర్జాతీయ విద్యార్థులకు చదువు పూర్తయ్యాక లభించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) వంటి వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్‌లను రద్దు చేయడం.

అమెరికాలో నీటి సంక్షోభం.. తీవ్రమైన నీటి కొరతతో అల్లాడుతున్న కార్పస్ క్రిస్టీ నగరం.. ప్రపంచ దేశాలకు గట్టి వార్నింగ్..

ఏటా హెచ్-1బి వీసాలలో సింహభాగం పొందుతున్న భారతీయ నిపుణులు, గ్రాడ్యుయేషన్‌ తర్వాత అమెరికాలో స్థిరపడాలని చూస్తున్న భారతీయ విద్యార్థులపై ఈ ప్రతిపాదనలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇది ప్రస్తుతానికి సెనేట్‌లో ప్రవేశపెట్టిన ఒక బిల్లు మాత్రమే. ఇది చట్టంగా మారడానికి ప్రతినిధుల సభ, సెనేట్ ఆమోదం పొంది, అధ్యక్షుడి సంతకం కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి H-1B నిబంధనల్లో ఎలాంటి తక్షణ మార్పులు అమలులోకి రాలేదని.. దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jul 29, 2026 08:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).