Tata Nexon Entry-Level Variants: టాటా నెక్సాన్ నుంచి ఎంట్రీ-లెవల్ వేరియంట్లు, ధర రూ. 7.49 లక్షలు నుంచి ప్రారంభం, ఫీచర్లు ఇవిగో..
Tata Nexon (photo-Tata Nexon)

మహీంద్రా XUV 3XO లాంచ్ తర్వాత  టాటా మోటార్స్ దాన్ని సవాల్ చేయడానికి  ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లను పరిచయం చేసింది. వీటి ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానుంది. పెట్రోల్ మోడల్‌లో స్మార్ట్ (ఓ), డీజిల్ మోడల్‌లో స్మార్ట్ +, స్మార్ట్ + ఎస్ కార్లు ఉంటాయి.డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో వచ్చిన స్మార్ట్ + వేరియంట్ రూ.9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్), స్మార్ట్ + ఎస్ వేరియంట్ రూ.10.59 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా ఉన్నాయి.

పాత స్మార్ట్ మోడల్ కారుతో పోలిస్తే న్యూ స్మార్ట్ (ఓ) పెట్రోల్ వేరియంట్ రూ.15 వేలు, స్మార్ట్ + వేరియంట్ రూ.30 వేలు, స్మార్ట్ + ఎస్ వేరియంట్ రూ.40 వేలు తక్కువ ధరకు లభిస్తాయి. టాటా నెక్సాన్ టాప్ వేరియంట్ రూ.14.74 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. భారత్ మార్కెట్లో కియా సొనెట్, మారుతి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, నిస్సాన్ మ్యాగ్నైట్, రెనాల్ట్ కైగర్ మోడల్ కార్లతో పోటీ పడుతుంది.

ఫీచర్ల విషయానికొస్తే, నెక్సాన్ యొక్క కొత్త ఎంట్రీ-లెవల్ పెట్రోల్ వేరియంట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు, LED టెయిల్‌ల్యాంప్‌లు, డ్రైవ్ మోడ్‌లు, ఇల్యూమినేటెడ్ లోగోతో కూడిన ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ పవర్ విండోస్, రివర్స్, పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ రేర్‌లో 16-అంగుళాల డైమండ్ కట్ డ్యుయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఫుల్లీ కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్ (ఎక్స్ ఫ్యాక్టర్ టెయిల్ ల్యాంప్), వెల్ కం, గుడ్ బై పంక్షన్లు ఉంటాయి. ఆరు కొత్త రంగుల్లో టాటా నెక్సాన్ కారు లభిస్తుంది. ఫియర్ లెస్ పర్పుల్, క్రియేటివ్ ఓషియన్, ప్యూర్ గ్రే, ఫ్లేమ్ రెడ్, డేటోనా గ్రే, ప్రిస్టిన్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. మారుతీ సుజుకి స్విఫ్ట్ -2024 వర్షన్ కారు వచ్చేసింది, ధర రూ.6.50 లక్షల నుంచి ప్రారంభం, ప్రత్యేకతలు ఇవిగో..

టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ కారు టూ-స్పోక్, ఫ్లాట్ బాటం స్టీరింగ్ వీల్, డాష్ బోర్డు దిగువన టచ్ ప్యానెల్ హెచ్‌వీఏసీ యూనిట్, సెంటర్ లో న్యూ గేర్ సెలెక్టర్ వంటి ఆప్షన్లతో ఈ కారు మరింత లగ్జరీగా కనిపిస్తుంది. టాటా నెక్సాన్ 1.2 లీటర్ల త్రీ సిలిండర్ టర్బో చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 118 హెచ్పీ విద్యుత్ వెలువరిస్తుంది. 1.5 లీటర్ల 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 113 హెచ్పీ విద్యుత్ వెలువరిస్తుంది.

టాటా నెక్సాన్ వేరియంట్లను బట్టి నాలుగు వేర్వేరు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, న్యూ 7-స్పీడ్ డీసీటీ, డీజిల్ ఇంజిన్ తోపాటు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.