New Maruti Swift 2024 Launched

భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తాజాగా మారుతి సుజుకి స్విఫ్ట్ -2024 వర్షన్ కారు ఆవిష్కరించింది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లలో లభిస్తున్న మారుతి స్విఫ్ట్.. కొత్తగా 1.2 లీటర్ల త్రీ-సిలిండర్ జడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 80 బీహెచ్పీ విద్యుత్, 112 ఎన్ఎం టార్క్ ఆవిష్కరిస్తుంది. లీటర్ పెట్రోల్ మీద 25.72 కి.మీ మైలేజీ అందిస్తుంది.దీని ధర రూ.6.50 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.ధరల శ్రేణి రూ.6.50 లక్షల నుంచి రూ.9.65 లక్షల వరకు ఉంది. మొత్తం ఐదు వేరియంట్లలో లభ్యమవుతోంది. బిగ్గెస్ట్ లేఆప్స్, 16 వేల మంది ఉద్యోగులను తొలగించిన టెస్లా, గత నెలలో ప్రమోషన్ పొంది ఈ నెలలో జాబ్ కోల్పోయిన భారత టెకీ ఆవేదన అక్షర రూపంలో..

లోపలిభాగంలో ఫ్రాంక్స్‌, బ్రెజా, బాలెనో తరహాలో ప్రీమియం లుక్ వచ్చేలా క్యాబిన్‌ను తీర్చిదిద్దారు. యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో కనెక్టివిటీతో 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ను అందిస్తోంది. టాప్‌ ఎండ్‌ మోడల్‌లో 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌, 360 డిగ్రీ కెమెరా, హెడ్‌-అప్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఛార్జింగ్, వెనక భాగంలో ఏసీ వెంట్స్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

కొత్త స్విఫ్ట్‌ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను మారుతీ ప్రామాణికం చేసింది. ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, రివర్స్‌ పార్కింగ్‌ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. డిజైన్‌ పరంగా చూస్తే బంపర్‌ను మార్చారు. కొత్త గ్రిల్‌ను అమర్చారు. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌తో హెడ్‌ల్యాంప్‌లను ఇచ్చారు. వెనకభాగంలోనూ స్కిడ్‌ ప్లేట్‌తో కూడిన కొత్త బంపర్‌ను ఇచ్చారు. సి-ఆకారపు డీఆర్‌ఎల్‌లతో ప్రత్యేకమైన లైట్లను పొందుపర్చారు.