Tesla Layoffs: బిగ్గెస్ట్ లేఆప్స్, 16 వేల మంది ఉద్యోగులను తొలగించిన టెస్లా, గత నెలలో ప్రమోషన్ పొంది ఈ నెలలో జాబ్ కోల్పోయిన భారత టెకీ ఆవేదన అక్షర రూపంలో..
Tesla Layoffs (Photo-X)

అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది.తమ కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 10 శాతం అంటే 16 వేల మంది ఉద్యోగులను టెస్లా తొలగించింది.తర్వాత కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. టెస్లా కంపెనీలో ఏడేళ్ల నుంచి సేవలు చేస్తోన్న ఓ భారత ఉద్యోగిని ఒక్క ఈమెయిల్‌తో తొలగించారు.

దాదాపు ఏడేళ్ల పాటు ఎంతో నమ్మకంగా పని చేసిన తన సోదరి లేఆఫ్‌కి గురైన తీరుపై ఆమె సోదరుడు జతిన్ సైనీ లింక్డిన్‌లో పోస్ట్ చేశారు. ఇందులో గత నెలలోనే ఆమె ప్రమోషన్ (పదోన్నతి) పొందినట్లు పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన తరువాత వారు న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్‌కు మకాం మార్చాలని కూడా అనుకున్నట్లు పేర్కొన్నారు.  టెస్లాలో ఆగని లేఆప్స్, మరింత మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న కంపెనీ, ఇప్పటికే నాలుగు సార్లు లేఆప్స్ ప్రకటించిన ఎలాన్ మస్క్ కంపెనీ

రోజు మాదిరిగానే జతిన్ సైనీ సోదరి మే 3న ఆఫీసుకు వెళ్తే తన కార్డు పనిచేయకపోవడాన్ని గమనించి విస్తుపోయింది. జాబ్ తొలగించారని తెలియగానే ఒక్కసారిగా షాక్ అయింది. ఆమెను మాత్రమే కాకుండా ఆమె టీమ్‌లో ఉండే దాదాపు 73 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఏడు సంవత్సరాలు ఎంతో నమ్మకంగా పనిచేసినప్పటికీ ఒక్క మైయిల్ పంపి తీసివేయడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. భారీ లేఆప్స్, 6,020 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న టెస్లా, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం

పోస్ట్ చివరలో.. జతిన్ సైనీ తన సోదరి ఉద్యోగాన్ని కోల్పోవడంతో కార్పొరేట్ నిర్ణయాల వెనుక ఉన్న విలువలను గురించి వెల్లడించారు. టెస్లాలో ఏడు సంవత్సరాలు పనిచేస్తే.. కష్టాన్ని ఏ మాత్రం గుర్తించకుండా ఇప్పుడు బయటకు పంపారు. శ్రమ మొత్తం సున్నా అయిపోయిందని అన్నారు.గ్లోబల్ మార్కెట్లో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో సంస్థ లేఆప్స్ ప్రకటించినట్లు సమాచారం. ఈ కారణంగా ఇప్పటికి నాలుగు సార్లు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఏప్రిల్ 15వ తేదీన 16 వేల మంది ఉద్యోగులు. 15 రోజుల తర్వాత 500 మందిని తొలగించారు.

ఏప్రిల్ నెలలో టెక్నాలజీ విభాగంలో 21 వేల 473 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. 50 కంపెనీలు ఉద్యోగులను తీసివేశాయని Layoff.fyi పేర్కొంది.