కాలిఫోర్నియాలోని సుమారు 6,020 మంది ఉద్యోగులను తొలగించాలని టెస్లా సంస్థ యోచిస్తోంది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. వాహన విక్రయాలు తగ్గుముఖం పడుతుండటం (declining sales), ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్‌లో పెరిగిన పోటీ కారణంగా కంపెనీపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. టెక్ రంగంలో బిగ్గెస్ట్ లేఆప్స్, 5 వేల మంది ఉద్యోగులను తీసేస్తున్న తోషిబా, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం
జూన్ 14 నుంచి కాలిఫోర్నియాలో 3,332 మంది ఉద్యోగులను, టెక్సాస్‌లో 2,688 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు రాయిటర్స్ నివేదించింది. యూఎస్ కార్మిక చట్టాలకు అనుగుణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.గతవారం టెస్లా ప్రపంచవ్యాప్తంగా 10 శాతానికి పైగా ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొన్న విషయం తెలిసిందే.
US రెగ్యులేటర్‌లతో దాఖలు చేసిన వివరాల ప్రకారం.. ఇటీవలే సంవత్సరాల్లో టెస్లా శ్రామిక శక్తి భారీగా పెరిగింది. 2021లో సంస్థలో ఉద్యోగుల సంఖ్య దాదాపు 100,000గా ఉండగా.. గతేడాది అంటే 2023 చివరినాటికి 140,000కు చేరింది.