Tesla Layoffs: టెస్లాలో ఆగని లేఆప్స్, మరింత మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న కంపెనీ, ఇప్పటికే నాలుగు సార్లు లేఆప్స్ ప్రకటించిన ఎలాన్ మస్క్ కంపెనీ
Tesla (Credits: X)

అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా మళ్లీ లేఆప్స్ ప్రకటించింది. గత వారం ఇలాన్ మస్క్ (Elon Musk) టెస్లాలో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు.రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.టెస్లా సీఈఓ మస్క్ ఏప్రిల్ 14న కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతానికంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. భారీ లేఆప్స్, 6,020 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న టెస్లా, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం

ఇందులో రిక్రూట్‌మెంట్, మార్కెటింగ్, సూపర్‌చార్జింగ్ టీమ్‌తో సహా వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఒక్క సూపర్‌చార్జింగ్ టీమ్‌లోనే సుమారు 500 మంది ఉద్యోగాలను తొలగించినట్లు సమాచారం.ఇప్పటికే మూడు సార్లు లేఆప్స్ ప్రకటించిన టెస్లా మరోమారు ఉద్యోగులను తొలగించడానికి పూనుకుంది. దీంతో ఉద్యోగుల్లో లేఆప్స్ భయం నిండిపోయింది. కంపెనీ ఉద్యోగులను తగ్గించడానికి ప్రధాన కారణం.. అంచనాల కంటే తక్కువ డెలివరీ సంఖ్యలు నమోదు చేయడమనే తెలుస్తోంది.