Amazon's Fab Phones Fest: భారీ తగ్గింపులతో అమెజాన్ ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌, అత్యంత తక్కువ ధరకే ఫోన్లను సొంతం చేసుకోండి, ఈ నెల 29 వరకు సేల్
Amazon Fab Phones Fest 2020 Sale Kicks Off With Offers : (Photo Credits: BussinessSuiteOnline.com)

Mumbai, Febuary 26: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వైబ్‌సైట్లో ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ను (Amazon's Fab Phones Fest) మళ్లీ ప్రారంభించింది. నేటి నుంచి 29వ తేదీ వరకు ఈ సేల్‌ కొనసాగనుంది. ఇందులో భారీ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. అలాగే ఐసీఐసీఐ (ICICI), కోటక్‌ మహీంద్రా కార్డుల )Kotak Mahindra) ద్వారా జరిపే కొనుగోళ్లపై ఫోన్లపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.

ప్రధానంగా శాంసంగ్‌, షావోమి, రియల్‌మి, ఆపిల్‌, వన్‌ప్లస్‌ తదితర కంపెనీలకు చెందిన ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయచ్చు. ఐఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌ను రూ.3వేల తగ్గింపు ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే రెడ్‌మి కే2 ప్రొ తోపాటు, ఐఫోన్‌ 11 ప్రొ, ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్‌ 7 ఫోన్లపై కూడా తగ్గింపు ధరలను అందిస్తోంది. వన్ ప్లస్ ఫోన్లను ఈ సేల్ లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 : బెస్ట్‌ డీల్స్‌

వన్‌ప్లస్ 7 టీ (8 జీబీ, 128 జీబీ) : తగ్గింపుతో ఫోన్ ధర: రూ. 34,999 అసలు ధర. రూ .37,999

ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ : తగ్గింపుతో ఫోన్ ధర రూ. 32,990. అసలు ధర రూ. 55,990

వన్‌ప్లస్ 7 ప్రో 8 జీబీ, 256 జీబీ : తగ్గింపుతో ఫోన్ ధర రూ. 42,999 అసలు ధర 52,999

వన్‌ప్లస్ 7 ప్రో (నెబ్యులా బ్లూ 8 జీబీ ర్యామ్‌ 256 జీబీ స్టోరేజ్‌): తగ్గింపుతో ఫోన్ ధర రూ. 42,999 (18శాతం తగ్గింపు)

శాంసంగ్ గెలాక్సీ ఎం 30 4 జీబీ ర్యామ్, 64 జిబి స్టోరేజ్ : తగ్గింపుతో ఫోన్ ధర రూ. 11,999 అసలు ధర రూ. 16,490

హానర్ 20: 6జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ : తగ్గింపుతో ఫోన్ ధర రూ.22,999 అసలు ధర రూ.35,999

Vivo V17 Pro : తగ్గింపుతో ఫోన్ ధర రూ.27,990 అసలు ధర రూ.32,990