Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు, ఫిబ్రవరి 17 నుంచి ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్, డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తగ్గింపు ధరలు
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkar) వినియోగదారులకు శుభవార్తను అందించింది. తక్కువ ధరల్లో స్మార్ట్‌ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి ’మొబైల్స్ బొనాంజా’ సేల్‌ను (Flipkart Mobile Bonanza Sale) ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 17 న ప్రారంభమై ఫిబ్రవరి 21న ముగియనుంది.
Mumbai, Febuary 16:ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkar) వినియోగదారులకు శుభవార్తను అందించింది. తక్కువ ధరల్లో స్మార్ట్‌ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి ’మొబైల్స్ బొనాంజా’ సేల్‌ను (Flipkart Mobile Bonanza Sale) ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 17 న ప్రారంభమై ఫిబ్రవరి 21న ముగియనుంది.
ఈ సేల్‌లో భాగంగా ఆపిల్, శాంసంగ్, వివో, రియల్‌మీ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లను తగ్గింపుధరల్లో అందుబాటులో ఉంచనుంది. ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్, బడ్జెట్ ఇలా స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపుల ధరలను ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ డెబిట్ , క్రెడిట్ కార్డులతో చేసిన అన్ని లావాదేవీలపై 10 శాతం తగ్గింపును అందిస్తోంది.
ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ50 (Samsung Galaxy A50) , వివో జెడ్1 ప్రొలు (Vivo Z1 Pro) రూ.12,999 నుంచి రూ.11,990ధరలలో లభ్యం కానున్నాయి. వివోజెడ్1. రియల్‌మి ఎక్స్‌టీ రూ.13,990, రూ,14,999 వద్ద తగ్గింపు ధరలలో లభ్యం కానున్నాయి. అలాగే వివో జెడ్ 1 ఎక్స్ , రియల్ మి ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్లు రూ. 13,990, 14,999 రూపాయల నుండి లభిస్తాయి.
నోకియా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ 7.2 ధరను తగ్గించి రూ .15,499 కే లభ్యమవుతుంది. ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ ఎడిషన్ రూ. రూ .26,990 దీని అసలు రూ. 40వేల నుంచి భారీ తగ్గింపు లభిస్తోంది
ఫ్లాగ్‌షిప్ కిల్లర్ రియల్‌మీ ఎక్స్ 2 ప్రో రూ .27,999 తగ్గింపు రూ. 2వేలు, బ్లాక్ షార్క్ 2 గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రూ .29,999, పిక్సెల్ 3 ఎ సిరీస్ రూ .27,999 కంటే తక్కువకు లభించనుంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 సిరీస్ కూడా రూ .22,999 నుండి లభిస్తుంది. వీటితో పాటుగదా ఐఫోన్లపై కూడా భారీ తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ ఎక్స్‌ఎస్ ధర రూ. 54,999 నుండి ప్రారంభం కాగా ఐఫోన్ 8 ను రూ .35,999 కు పొందవచ్చు.
(The above story first appeared on LatestLY on Feb 16, 2020 05:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

