Raghuram Rajan: బ్యాకింగ్ వ్యవస్థను వెంటనే ప్రక్షాళన చేయాలి, ప్రమాదకర స్థాయిలో భారత ద్రవ్యలోటు, కీలక నిర్ణయాలలో రాజకీయ వ్యవస్థ జోక్యం తగదు, హెచ్చరించిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
భారత ద్రవ్య లోటు ప్రమాదకర స్థాయిలో ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. 2016లో భారత వృద్ధి రేటు 9శాతం ఉండగా, క్రమక్రమంగా ఇప్పుడు అయిదు శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.
New Delhi,October 13: భారత ద్రవ్య లోటు ప్రమాదకర స్థాయిలో ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. 2016లో భారత వృద్ధి రేటు 9శాతం ఉండగా, క్రమక్రమంగా ఇప్పుడు అయిదు శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. దేశంలో పెట్టుబడులు, వినియోగం, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవని దీంతో భారత వృద్ధి రేటు గణనీయంగా పడిపోతూ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న తరుణంలో ఇండియా తన నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో దేశంలోని కీలక నిర్ణయాలలో రాజకీయ వ్యవస్థ విపరీతమైన జోక్యం చేసుకుంటుందని రాజన్ తెలిపారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్‌టీ నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు సంక్లిష్ల పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, పంపిణీ వ్యవస్థకు ప్రాధాన్యమిస్తుందని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించారు. విదేశీ పోటీని ఆహ్వానించాలని, కొందరు వాదిస్తున్నట్లుగా మన సంస్కృతి, సంప్రదాయాలకు ఏ మాత్రం విఘాతం కలగదని పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on Oct 13, 2019 04:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

