Jio New Plan: జియో రూ.1776 ప్లాన్ వచ్చేసింది, 336 రోజుల వాలిడిటీ, ఒక ప్లాన్ పూర్తి కాగానే మరో ప్లాన్ ఆటోమేటిగ్గా యాక్టివేట్, అలాగే కొత్త ప్లాన్ల గురించి కూడా తెలుసుకోండి
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నూతన ప్లాన్ రూ. 1776 (Jio Rs 1,776 All-in-One plan)ను తాజాగా ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Airtel, Vodafone Idea) కంపెనీలు ఇప్పటికే తన ప్రీపెయిడ్ చార్జిలను పెంచగా, డిసెంబర్ 6వ తేదీన జియో ఆ చార్జిలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
Mumbai, December 6: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నూతన ప్లాన్ రూ. 1776 (Jio Rs 1,776 All-in-One plan)ను తాజాగా ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Airtel, Vodafone Idea) కంపెనీలు ఇప్పటికే తన ప్రీపెయిడ్ చార్జిలను పెంచగా, డిసెంబర్ 6వ తేదీన జియో ఆ చార్జిలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే అంతకు ముందుగానే జియో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టడం విశేషం. ఈ రూ.1776 ప్లాన్‌లో కస్టమర్లకు రూ.444 విలువైన 4 రీచార్జి ప్లాన్లు వస్తాయి. వాటిల్లో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 84 రోజుల వాలిడిటీ సౌకర్యాలు ఉంటాయి.
అయితే ఆ 4 ప్లాన్లను ఒకేసారి కలిపి రూ.1776కు రీచార్జి చేసుకుంటే ఏకంగా 336 రోజుల వాలిడిటీని, ప్లాన్లను, వాటి బెనిఫిట్లను ఒకేసారి పొందవచ్చని జియో తెలిపింది. ఈ క్రమంలో రూ.444 ప్లాన్ ఒకటి పూర్తి కాగానే మరొకటి ఆటోమేటిగ్గా యాక్టివేట్ అవుతుంది. అలా ఏడాదిలో ఆ 4 ప్లాన్లను ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటుగా జియో మరికొన్ని ప్లాన్లను కూడా పరిచయం చేసింది.
ఈ ప్లాన్లలో జియో ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసుకునేందుకు గాను ఉచిత ఆఫ్-నెట్ మినట్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఫెయిర్ యూసేజ్ పాలసీ ప్రకారం ఆ నిమిషాలు అయిపోతే జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నారు. ఈ ప్లాన్లతోపాటు జియో ప్రైమ్ బెనిఫిట్స్, జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్, జియో హెల్త్‌హబ్ తదితర యాప్ సేవలు బండిల్‌గా లభిస్తాయి.
జియో ప్రకటించిన నూతన ఆలిన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు
28 రోజుల వాలిడిటీ ఉన్న ప్లాన్లు
రూ.199 - రోజుకు 1.5 జీబీ డేటా, 1000 ఆఫ్-నెట్ నిమిషాలు
రూ.249 - రోజుకు 2 జీబీ డేటా, 1000 ఆఫ్-నెట్ నిమిషాలు
రూ.349 - రోజుకు 3 జీబీ డేటా, 1000 ఆఫ్-నెట్ నిమిషాలు
రూ.129 - 2 జీబీ డేటా, 1000 ఆఫ్-నెట్ నిమిషాలు, 28 రోజుల వాలిడిటీ
56 రోజుల వాలిడిటీ ప్లాన్లు
రూ.399 - రోజుకు 1.5 జీబీ డేటా, 2000 ఆఫ్-నెట్ నిమిషాలు
రూ.444 - రోజుకు 2 జీబీ డేటా, 2000 ఆఫ్-నెట్ నిమిషాలు
84 రోజుల వాలిడిటీ ప్లాన్లు
రూ.555 - రోజుకు 1.5 జీబీ డేటా, 3000 ఆఫ్-నెట్ నిమిషాలు
రూ.599 - రోజుకు 2 జీబీ డేటా, 3000 ఆఫ్-నెట్ నిమిషాలు
రూ.329 - 6 జీబీ డేటా, 3000 ఆఫ్-నెట్ నిమిషాలు, 84 రోజుల వాలిడిటీ
365 రోజుల వాలిడిటీ ప్లాన్
రూ.2199 - రోజుకు 1.5 జీబీ డేటా, 12,000 ఆఫ్-నెట్ నిమిషాలు
రూ.1299 - 24 జీబీ డేటా, 12,000 ఆఫ్-నెట్ నిమిషాలు, 365 రోజుల వాలిడిటీ
(The above story first appeared on LatestLY on Dec 06, 2019 05:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

