‘Pallaburusu’ Teaser Out: పళ్ళబురుసు టీజర్ వచ్చేసింది.. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో నవ్వులు పూయిస్తున్న తండ్రీకొడుకుల కామెడీ.. ఆగస్టు 14న గ్రాండ్‌గా రిలీజ్..

అక్కినేని నాగార్జున సారథ్యంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న విలేజ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ పళ్లబురుసు అధికారిక టీజర్ విడుదలైంది. సుధాకర్ రెడ్డి, ప్రముఖ నటుడు మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిన్న బడ్జెట్ చిత్రం.. మొదటి నుంచీ వినూత్న ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తూ వస్తోంది.

‘Pallaburusu’ Teaser Out: పళ్ళబురుసు టీజర్ వచ్చేసింది..  తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో నవ్వులు పూయిస్తున్న  తండ్రీకొడుకుల కామెడీ.. ఆగస్టు 14న గ్రాండ్‌గా రిలీజ్..
Pallaburusu Teaser (Photo Credits: Annapurna Studios - YouTube)

‘Pallaburusu’ Teaser Out: అక్కినేని నాగార్జున సారథ్యంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న విలేజ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ పళ్లబురుసు అధికారిక టీజర్ విడుదలైంది. సుధాకర్ రెడ్డి, ప్రముఖ నటుడు మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిన్న బడ్జెట్ చిత్రం.. మొదటి నుంచీ వినూత్న ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తూ వస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ రైడర్‌లా సాగుతూ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఈ చిత్రాన్ని పక్కా గ్రామీణ నేపథ్యంలో తండ్రీకొడుకుల మధ్య సాగే ఒక విచిత్రమైన, సరదా వివాదం చుట్టూ తెరకెక్కించారు. వయసు పైబడటంతో వేపపుల్లతో పళ్లు తోముకోలేక.. ఒక టూత్‌బ్రష్ (పళ్లబురుసు) కొనివ్వమని తండ్రి.. కొడుకుని పదే పదే అడుగుతుంటాడు. అయితే కొడుకు తనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల దానిని నిర్లక్ష్యం చేస్తాడు. ఈ చిన్న టూత్‌బ్రష్ పాయింట్ చుట్టూ నడిచే సంభాషణలు, తెలంగాణ యాసతో మురళీధర్ గౌడ్ మార్క్ నటన థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది.

‘Pallaburusu’ Teaser Out:

తండ్రీకొడుకుల ప్రధాన కథతో పాటు, గ్రామంలోని ఒక బార్బర్ జీవితం, అతని ప్రేమ అడ్వెంచర్ల చుట్టూ సాగే మరో ఆసక్తికరమైన సబ్‌ప్లాట్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రజ్వల్, గోమతి ఈ పాత్రల్లో కనిపిస్తూ వినోదాన్ని పంచనున్నారు. నేచురల్ లొకేషన్లు, పల్లెటూరి వాతావరణం, లోకల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ ఎంతో రియలిస్టిక్‌గా మలిచారు.

గతంలో 'ఉయ్యాల జంపాల' వంటి వైవిధ్యమైన రూరల్ డ్రామాలను ప్రోత్సహించిన అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రానికి బ్యాకింగ్ ఇవ్వడం విశేషం. ఎపిక్ స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్ స్టోరీ ఫేమ్ పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో, ఫోటోలు

స్వాతంత్ర్య దినోత్సవ (Independence Day) లాంగ్ వీకెండ్‌ను సద్వినియోగం చేసుకునేందుకు పళ్లబురుసు చిత్రాన్ని ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ రూరల్ ఫన్ ఎంటర్‌టైనర్ మంచి విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

కథ ఏంటంటే..

వయసు పైబడి పంటి నొప్పితో బాధపడుతున్న 'శంభూ' అనే పల్లెటూరి వృద్ధుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సాంప్రదాయ వేప కొమ్మతో పళ్ళు తోముకోలేక, తన కోసం ఒక ఆధునిక టూత్‌బ్రష్ (పల్లబురుసు) కొనివ్వమని అతను తన కొడుకును పదేపదే అడుగుతుంటాడు. ఆ ఇంట్లో మొదలైన ఈ చిన్న రిక్వెస్ట్ కాలక్రమేణా అపార్థాలకు, కుటుంబ కలహాలకు, ఊహించని గ్రామీణ గందరగోళానికి దారితీస్తుంది. చివరకు ఒక చిన్న ఇంటి సమస్య ఏ విధంగా పెద్ద స్థానిక ఘర్షణగా మారింది.. దానికి కోర్టుతో ఉన్న ముడి ఏమిటనేది ఈ చిత్రంలో నవ్వులు పూయించేలా చూపించనున్నారు.

(The above story first appeared on LatestLY on Jul 29, 2026 06:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).