భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (National Awards 2023) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డుల‍్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఉత్తమ నటుడు కేటగిరీలో అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్నాడు. 2021 సంవత్సరానికి గానూ ‘పుష్ప: ది రైజ్’లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ (Allu arjun) సొంతం చేసుకున్నారు. తద్వారా 68 ఏళ్ల సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా రికార్డ్ సృష్టించాడు.
ఉత్తమ నటి అవార్డును ఈసారి అలియా భట్ (గంగూభాయి కాఠియావాడి), కృతిసనన్(మిమి) ఇద్దరికి దక్కాయి. 31 విభాగాల్లో ఫీచర్ ఫిల్స్మ్‌కు, 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు ప్రకటించారు. 2021 సంవత్సరానికి 281 ఫీచర్ ఫిల్మ్‌లు వివిధ విభాగాల్లో ఈసారి జాతీయ అవార్డుల కోసం స్క్రూటినీకి వచ్చినట్లు జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఉత్తమ చిత్ర విమర్శకుడు కేటగిరిలో పురుషోత్తమచార్యులు (తెలుగు)కు అవార్డు దక్కింది.
చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, చంద్రయాన్-3 మిషన్‌ను అవహేళన చేసినందుకు ప్రకాష్ రాజ్‌పై ఫిర్యాదు
2021 సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ (Uppena) ఎంపికైంది. ఇక ఉత్తమ హిందీ చిత్రంగా సర్దార్ ఉద్ధమ్, ఉత్తమ గుజరాతీ చిత్రం ‘ఛల్లో షో’ (భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్‌కు వెళ్లింది), ఉత్తమ కన్నడ చిత్రంగా ‘777 చార్లీ’, ఉత్తమ మలయాళీ చిత్రంగా ‘హోమ్’ ఎంపికయ్యాయి. హిందీ నుంచి ‘గంగూబాయి కాఠియావాడి’, తెలుగు నుంచి ‘పుష్ప’, ‘ఆర్ఆర్‌ఆర్’ అత్యధిక కేటగిరిల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి.
ఉత్తమ నటుడు సహా, ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రఫీ (ప్రేమ్ రక్షిత్), ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ (కింగ్ సాలమన్- ఆర్ఆర్‌ఆర్), ఉత్తమ గేయ రచయిత (చంద్రబోస్ -కొండపొలం), ఉత్తమ నేపథ్య గాయకుడు (కాల భైరవ- కొమురం భీముడో), ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీ ప్రసాద్- పాటలు), ఉత్తమ సంగీత దర్శకుడు (ఎం.ఎం.కీరవాణి- నేపథ్యం) అవార్డులు దక్కించుకున్నారు.
విభాగాల వారీగా అవార్డు గ్రహీతలు
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి) & కృతిసనన్ (మిమీ)
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ద కశ్మీరీ ఫైల్స్ - హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ- హిందీ)
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి - మరాఠీ సినిమా)
ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్): పుష్ప- దేవిశ్రీ ప్రసాద్
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : ఆర్ఆర్ఆర్- ఎమ్.ఎమ్ కీరవాణి
బెస్ట్ ఫీచర్ ఫిలిం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ)
ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ & కో (గుజరాతీ)
ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్-ప్రేమ్ రక్షిత్
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్-శ్రీనివాస్ మోహన్
బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ - తమిళ మూవీ)
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ - కొమురం భీముడో)
ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్-కొండపొలం మూవీ (తెలుగు)
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్(స్టంట్ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్- కింగ్ సోలమన్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్-హిందీ)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: దిమిత్రీ మాలిక్ & మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్)
ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి మూవీ)బెస్ట్ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ & సోనూ కేపీ (చవిట్టు మూవీ-మలయాళం)
బెస్ట్ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) : అనీష్ బసు (జీలీ మూవీ- బెంగాలీ)
బెస్ట్ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్‌డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్-హిందీ)
బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా-మలయాళం)
బెస్ట్ స్క్రీన్‌ప్లే (డైలాగ్ రైటర్) : ప్రకాశ్ కపాడియా & ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్ మూవీ-హిందీ)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రబరీ (ఛెల్లో షో - గుజరాతీ సినిమా)
బెస్ట్ ఫిలిం ఆన్ ఎన్వైర్‌మెంట్ కంజర్వేషన్: అవషావ్యూహం (మలయాళం)
బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్-ద రెజోనెన్స్ (అస్సామీస్)
బెస్ట్ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్: ఆర్ఆర్ఆర్
ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం)
స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ సినిమా)
నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ)
భాషల వారీగా ఉత్తమ చిత్రాలు
బెస్ట్ మీషింగ్ ఫిల్మ్: బూంబా రైడ్
బెస్ట్ అస్సామీస్ ఫిల్మ్: అనుర్
బెస్ట్ బెంగాలీ ఫిల్మ్: కల్కొకో-హౌస్ ఆఫ్ టైమ్
బెస్ట్ హిందీ ఫిల్మ్: సర్దార్ ఉద్దామ్
బెస్ట్ గుజరాతీ ఫిల్మ్: లాస్ట్ ఫిల్మ్ షో
బెస్ట్ కన్నడ ఫిల్మ్: చార్లి 777
బెస్ట్ మైథిలీ ఫిల్మ్: సమాంతర్
బెస్ట్ మరాఠీ ఫిల్మ్: ఏక్ దా కై ఝాలా
బెస్ట్ మలయాళ ఫిల్మ్: హోమ్
బెస్ట్ మెయిటెయిలోన్ ఫిల్మ్: ఏక్ హోయిగీ యమ్ (అవర్ హౌమ్)
బెస్ట్ ఒడియా ఫిల్మ్: ప్రతిక్ష‍్య (ద వెయిట్)
బెస్ట్ తమిళ్ ఫిల్మ్: కడైసి వివసై (ద లాస్ట్ ఫార్మర్)
బెస్ట్ తెలుగు ఫిల్మ్: ఉప్పెన
నాన్ ఫీచర్ ఫిలింస్
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ఏక్ థా గావ్ (గర్హివాలీ - హిందీ)
బెస్ట్ వాయిస్ ఓవర్: కులదా కుమార్ భట్టాచారి (హాథీ బందూ)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ఇషాన్ దీవేచా (సక్కలెంట్)
బెస్ట్ ఎడిటింగ్: అబ్రో బెనర్జీ (ఇఫ్ మెమొరీ సెర్వ్స్ మీ రైట్)
బెస్ట్ ఆన్‌లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్: సురుచి శర్మ (మీన్ రాగా)
బెస్ట్ ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్‌డ్ ట్రాక్): ఉన్ని కృష్ణన్ (ఏక్ థా గావ్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: బిట్టూ రావత్ (పాతాళ్ తీ)
ఉత్తమ డైరెక్షన్: బకుల్ మతియానీ (స్మైల్ ప్లీజ్)
ఉత్తమ కుటుంబ కథా చిత్రం: చాంద్ సాన్సీ (హిందీ)
ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: దాల్ బాత్ (గుజరాతీ)
స్పెషల్ జ్యూరీ అవార్డ్: రేఖా మూవీ (మరాఠీ)
బెస్ట్ ఏనిమేషన్ ఫిల్మ్: కండిట్టుండూ (మలయాళం)
బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్)
బెస్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఫిలిం: ఆయుష్మాన్ (ఇంగ్లీష్-కన్నడ)
బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: సిర్పంగిలన్ సిర్పంగల్ (తమిళం)
బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్(షేర్‌డ్): మీతూ దీ (ఇంగ్లీష్) & త్రీ టూ వన్ (మరాఠీ-హిందీ)
బెస్ట్ ఎన్వైర్‌మెంట్ ఫిలిం: మున్నం వలవు (మలయాళం)
బెస్ట్ ప్రమోషనల్ ఫిలిం: వర్లీ ఆర్ట్ (ఇంగ్లీష్)
బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిలిం: ఇథోస్ ఆఫ్ డార్క్‌నెస్ (హిందీ-బెంగాలీ)
బెస్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫిలింస్: టీఎన్ కృష్ణన్ బౌ స్ట్రింగ్స్ టూ డివైన్
బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిలిం(షేర్‌డ్): రుఖు మతిర్ దుఖు మహీ (బెంగాలీ) & బియాండ్ బ్లాస్ట్ (మణిపురి)
బెస్ట్ ఎత్నోగ్రాఫిక్ ఫిలిం: ఫైర్ ఆన్ ఎడ్జ్ (టివా)
బెస్ట్ డెబ్యూ నాన్ ఫియేచర్ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: పాంచిక (గుజరాతీ- డైరెక్టర్ అంకిత్ కొఠారీ)