Actress Bhagyashree: ప్రభాస్ తిండి పిచ్చోడు..24 గంటలు అదే ధ్యాసలో ఉంటాడు, డార్లింగ్ గురించి కొన్ని విషయాలను బయటపెట్టిన నటి భాగ్యశ్రీ, షూటింగ్‌లో ఎప్పుడూ తిండి గురించే మాట్లాడతాడని తెలిపిన మైనే ప్యార్ కియా మూవీ ముద్దుగుమ్మ

డార్లింగ్ ప్రభాస్ గురించి మైనే ప్యార్ కియా ఫేమ్ హీరోయిన్ భాగ్యశ్రీ (Actress Bhagyashree) కొన్నిఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న రాధే శ్యామ్ (Radhe Shyam)సినిమాలో ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ నటిస్తున్న సంగతి విదితమే.

Actress Bhagyashree: ప్రభాస్ తిండి పిచ్చోడు..24 గంటలు అదే ధ్యాసలో ఉంటాడు, డార్లింగ్ గురించి కొన్ని విషయాలను బయటపెట్టిన నటి భాగ్యశ్రీ, షూటింగ్‌లో ఎప్పుడూ తిండి గురించే మాట్లాడతాడని తెలిపిన మైనే ప్యార్ కియా మూవీ ముద్దుగుమ్మ
Bhagyashree Photo credit: Instagram

డార్లింగ్ ప్రభాస్ గురించి మైనే ప్యార్ కియా ఫేమ్ హీరోయిన్ భాగ్యశ్రీ (Actress Bhagyashree) కొన్నిఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న రాధే శ్యామ్ (Radhe Shyam)సినిమాలో ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ నటిస్తున్న సంగతి విదితమే. షూటింగ్ సమయంలోనే ప్రభాస్‌ (Darling prabhas) బిహేవియర్ గురించి తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయానని నటి తెలిపింది. ప్రభాస్ ఎంత కూల్ అని ఆయనకు 24 గంటలు ఒకే పిచ్చి ఉంటుందని.. అదే ఫుడ్ అని భాగ్యశ్రీ తెలిపింది.

తిండి విషయంలో ప్రభాస్ అందరికంటే ఓ మెట్టు పైనే ఉంటాడని.. ఎప్పుడు చూడూ సెట్స్ లో ఫుడ్ ఐటమ్స్ గురించే చర్చించే వాడని.. గంటల తరబడి ప్రభాస్ నోటి నుంచి ఫుడ్ గురించి తప్ప మరో విషయమే రాదని భాగ్య శ్రీ చెప్పుకొచ్చింది. ఆయన తినడమే కాదు.. సెట్ లో అందరికీ తినిపించే వాడని.. ఇంటి నుంచి యిష్టమైన ఫుడ్స్ అన్నీ వండించి మరీ తీసుకొచ్చేవాడని చెప్పింది. ప్రభాస్‌తో షూటింగ్ చేసిన ఆ కొన్ని రోజులు ఎప్పటికీ మర్చిపోలేమని.. ఎంతో ఎంజాయ్ చేశామని చెబుతోంది.

నేను రాజకీయాల్లోకి రావడం లేదు, మక్కళ్‌ మండ్రంను రద్దు చేస్తున్నా, సంచలన ప్రకటన చేసిన రజినీకాంత్, దాని స్థానంలో రజనీ అభిమాన సంక్షేమ మండ్రం ఏర్పాటు, రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో భేటీ అయిన సూపర్‌స్టార్‌

అంత ఫుడ్ తిన్నా కూడా.. ఫిట్ నెస్ విషయంలోనూ ప్రభాస్ అంతే జాగ్రత్తగా ఉంటాడని తెలిపింది. ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ మధ్యే స్పెషల్ పూతరేకులు భాగ్య శ్రీ కోసం పంపించాడు. తెలుగు ఫుడ్స్ తనకు పూర్తిగా అలవాటు చేసాడు.. ఫుడ్ విషయంలో తాను కూడా పిచ్చిదాన్ని అయిపోయానంటూ భాగ్య శ్రీ సరదాగా కామెంట్ చేసింది.

సల్మాన్ ఖాన్ మైనే ప్యార్ కియా సినిమాతో ఇండియాను కుదిపేసిన అమ్మడు ఆ తరువాత ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయింది. తాజాగా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంతో అలనాటి ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో అతడి తల్లిగా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తైపోయింది.

(The above story first appeared on LatestLY on Jul 13, 2021 01:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).