Disco Shanti: తాళి తప్ప ఇంకేమీ మిగల్లేదు.. శ్రీహరి భార్య డిస్కో శాంతి భావోద్వేగం.. తమ ఆర్థిక స్థితి తలకిందులైందని ఆవేదన
దివంగత టాలీవుడ్ నటుడు, రియల్ స్టార్ శ్రీహరి.. నటి శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రీహరి సినిమాల్లో అన్ని తరహా పాత్రలు చేసి మెప్పించారు. అయితే ఆయన 2013లో మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
Hyderabad, Aug 19: దివంగత టాలీవుడ్ నటుడు, రియల్ స్టార్ శ్రీహరి (Srihari).. నటి శాంతిని (Shanti) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రీహరి సినిమాల్లో అన్ని తరహా పాత్రలు చేసి మెప్పించారు. అయితే ఆయన 2013లో మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన మరణానంతరం శాంతి.. ఆమె పిల్లలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకప్పుడు డిస్కో శాంతిగా (Disco Shanti) బాగా ఫేమస్ అయిన శాంతి.. ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని అంటున్నారు.
Disco Shanti: శ్రీహరి చనిపోయాక మమ్మల్ని మోసం చేశారు.. ఆర్థికంగా అన్నీ కోల్పోయాం: డిస్కో శాంతిhttps://t.co/rC5Dz1ovJD#DiscoShanti #Srihari #Tollywood #TeluguNews
— Sakshi (@sakshinews) August 18, 2023
సమస్యలు చుట్టుముట్టాయన్న శాంతి
శ్రీహరి మరణం తరువాత తమ ఆర్థిక స్థితి తలకిందులైందని, తాళి తప్ప ఇంకేమీ మిగల్లేదంటూ ఓ ఇంటర్వ్యూలో తాజాగా చెప్పుకొచ్చారు. తమను ఒక్కసారిగా అనేక సమస్యలు చుట్టుముట్టాయని డిస్కో శాంతి గుర్తుచేసుకున్నారు. భర్తను కోల్పోయిన దుఃఖంలో ఉన్న తాను కొందరి మోసం కారణంగా డబ్బు కూడా నష్టపోయానని.. ఆ డబ్బే ఉండి ఉంటే తన కుమారుడు చదువుకునేందుకు విదేశాలకు వెళ్లి ఉండేవాడని అన్నారు. శ్రీహరి కట్టిన తాళి తప్ప సర్వం కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ రెండు ఇళ్లపై వస్తున్న అద్దెతోనే జీవితం నెట్టుకొస్తున్నామని చెప్పారు. రోడ్డు విస్తరణలో తమ జాగాలో కొంత భాగం కోల్పోయినందుకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని బ్యాంకులో వేశామని, దానిపైనా కొంత ఆదాయం వస్తోందని చెప్పారు.
(The above story first appeared on LatestLY on Aug 19, 2023 10:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

