Adipurush Trailer: జూన్ 16న థియేటర్లలోకి ఆదిపురుష్, బాహుబలిని దాటేసిన రామునిగా ప్రభాస్ విశ్వరూపం,బాక్సాఫీస్ కుంభస్థలం మీద కొట్టిన దర్శకుడు ఓం రౌత్
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న త్రీడీ మోషనల్ క్యాప్చర్ టెక్నాలజీ చిత్రం ‘ఆదిపురుష్. జూన్ 16న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ విడుదల అవుతోన్న ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం (మే 9) రోజున మేకర్స్ విడుదల చేశారు
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న త్రీడీ మోషనల్ క్యాప్చర్ టెక్నాలజీ చిత్రం ‘ఆదిపురుష్. జూన్ 16న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ విడుదల అవుతోన్న ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం (మే 9) రోజున మేకర్స్ విడుదల చేశారు.ఆది పురుష్ ట్రైలర్‌ను గమనిస్తే హనుమంతుడి కోణంలో కథ ఉంటుందనిపిస్తోంది.
ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు.. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికున్న అహంకారాన్ని అంతం చేసింది ఇది ఆ రఘునందుడి గాథ. యుగయుగాల్లోనూ సజీవం అంటూ ప్రారంభమైన ట్రైలర్‌లో ప్రభాస్ రాఘవుడిగా మెప్పిస్తున్నారు.
రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. రాముడి గెటప్‌లో ప్రభాస్ పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు. సీతను రావణుడు అపహరించుకుపోవడం, శబరి ఎంగిలి పళ్లు రాముడు తినడం, సంజీవని పర్వతాన్ని హనుమంతుడు పెకిలించడం, లంకను తోకతో అంటించడం, సముద్రంలో బండరాళ్లు వేసి లంకకు దారి ఏర్పరచడం వంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలను ట్రైలర్‌లో చూపించారు. విడుదలైన గంటలోనే ట్రెండింగ్ లో నంబర్ వన్ స్థానానికి వచ్చేసింది.
'నా ప్రాణమే జానకిలో ఉంది', 'మనం జన్మతో కాదు చేసే కర్మతో చిన్నాపెద్ద అవుతాం', 'నాకోసం పోరాడొద్దు, వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి. ఆరోజు కోసం పోరాడండి.. పోరాడతారా? అయితే దూకండి ముందుకు.. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి' అంటూ ప్రభాస్ నోటి వెంట వచ్చిన డైలాగులు వైరల్ అవుతున్నాయి.
'రాఘవ నన్ను పొందడానికి శివధనస్సును విరిచారు, ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి' అని జానకి చెప్పే డైలాగులు బాగున్నాయి. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమాను భూషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారియా, క్రిషణ్ కుమార్, రాజేశ్ నాయర్, వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. జూన్ 16న ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్రానికి అజయ్ అతుల్ సంగీతం అందిస్తుండగా కార్తీక్ పల్నానీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే గతంలో రిలీజ్ చేసిన టీజర్‌లో గ్రాఫిక్స్, విజువల్స్ అస్సలు బాగోలేదని పాన్ ఇండియా సినిమా అని చెప్పి ఇంత నాసిరకమైన గ్రాఫిక్స్ ఏంటని దారుణమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో మేకర్స్ మళ్లీ రీషూట్స్ చేసి గ్రాఫిక్స్, విజువల్స్ ఎఫెక్ట్‌తో సరికొత్తగా ముందుకు వచ్చారు.
తెలుగు, హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. జూన్ 3న తిరుపతిలోని ఎస్.వి.గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుకలు జరగనున్నాయి. దీనికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on May 09, 2023 03:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

